Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాన్ని నెత్తికి రాసుకుంటున్నారా? కాస్త ఆగండి

గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా తీర్థం తీ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (18:28 IST)
దేవాలయాలకు వెళ్తే కుంకుమ ప్రసాదం తీసుకుంటాం. తీర్థ ప్రసాదం తీసుకుంటాం. కుంకుమను నుదుటన పెట్టుకుంటాం. అదే తీర్థాన్ని స్వీకరిస్తాం. అంతటితో ఆగకుండా ఆ చేతిని తలపై రాసుకుంటాం. అయితే ఈ పద్ధతి మంచిది కాదని పండితులు అంటున్నారు.

చేతులతో ప్రార్థనలు చేస్తే సరికానీ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట. ముఖ్యంగా గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు. అంతేకానీ గుడిలో ఇచ్చే తీర్థాన్ని నెత్తిపై రాసుకోవడం మంచిది కాదు.
 
సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది. ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు.

అందుచేత తీర్థం తీసుకున్న చేతిని సాధారణంగా నీటితో కడుక్కోవాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. దోషమవుతుంది. జేబు రుమాలుతో తుడుచుకుని తీసుకోవాలి. లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments