Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి ఆకులతోనే తోరణాలు ఎందుకు కట్టాలి?

హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకస్థానముంది. ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని వుంటుంది. ముఖ్యంగా.. పండగలు, పబ్బాలతో పాటు శుభకార్యాలు జరిగినపుడు ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు

Webdunia
మంగళవారం, 23 మే 2017 (07:56 IST)
హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకస్థానముంది. ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని వుంటుంది. ముఖ్యంగా.. పండగలు, పబ్బాలతో పాటు శుభకార్యాలు జరిగినపుడు ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, ఇంటి ద్వారాలకు కేవలం మామిడి ఆకులతోనే ఎందుకు తోరణాలు కడతారో చాలా మందికి తెలియదు. ఆ కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
1. సాధారణంగా మామిడి ఆకుల్లో ల‌క్ష్మీదేవి కొలువైవుంటుందని పెద్దలు చెపుతారు. అందుకే ఆ ఆకుల‌తో చేసిన తోరణాలు క‌డితే ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేరుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌.
 
2. ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణంలోని ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ట‌. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. ఈ కారణంగా అన్నీ శుభాలే క‌లుగుతాయి.
 
3. మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోర‌ణాల‌ను ఆల‌యాల్లో కూడా క‌డుతుంటారు. అలాంటిది ఆ తోర‌ణాలు గృహాల్లో కూడా క‌డితే అంతామంచే జ‌రుగుతుంద‌ని మ‌న పూర్వీకుల న‌మ్మ‌కం. పురాణాలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.
 
4. ఇంట్లో ఏవేని దుష్టశక్తులు ఉండివున్నట్టయితే ఆ శక్తులన్నీ వెళ్లిపోయి.. దేవ‌త‌లు అనుగ్ర‌హిస్తార‌ట‌. అలాగే, మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు. మామిడి ఆకుల తోర‌ణాల‌ను చూస్తే ఎవ‌రికైనా మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ట‌.
 
5. ఇంట్లో ఉండే గాలి శుభ్ర‌మ‌వుతుంద‌ట‌. త‌ద్వారా చ‌క్క‌ని ఆరోగ్యం క‌లుగుతుంద‌ట‌. ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి మ‌న‌కు లభిస్తుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

2025: వృశ్చిక రాశి కుటుంబ జీవితం ఎలా వుంటుంది? ఆకుపచ్చ మొక్కలను?

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

తర్వాతి కథనం
Show comments