Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షా బంధన్ శ్రీకృష్ణుడు- ద్రౌపది అన్నాచెల్లెల బంధానికి ప్రతీక.. ఆ చీర కొంగే..?

శ్రావణ మాసంలో వచ్చే తొలి రాఖీ పండుగ రోజున సోదరీ సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి నుంచి చెల్లెళ్లు కానుకలు పొందుతుంటారు. అలాంటి రాఖీ పండుగకు శ్రీకృష్ణ-ద్రౌపదీ

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (12:46 IST)
శ్రావణ మాసంలో వచ్చే తొలి రాఖీ పండుగ రోజున సోదరీ సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి నుంచి చెల్లెళ్లు కానుకలు పొందుతుంటారు. అలాంటి రాఖీ పండుగకు శ్రీకృష్ణ-ద్రౌపదీ దేవీల అన్నాచెల్లెల్ల బంధానికి ప్రతీకగా చెప్తుంటారు. పూర్వం శ్రీకృష్ణునికి సృతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే పిల్లాడు పుట్టాడు. వికృతంగా పుట్టే ఆ పిల్లాడు.. శ్రీకృష్ణుడి స్పర్శతోనే చక్కని రూపం ధరిస్తాడు. అయితే చక్కని రూపం ఇచ్చిన వాడి చేతిలో శిశుపాలుడు మరణిస్తాడనే శాపం ఉండేది. 
 
దీన్ని గమనించిన సృతదేవి తన కొడుకుని చంపే పరిస్థితి వచ్చినా కూడా పెద్ద మనసుతో క్షమించి వదిలేయమని వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి నూరు తప్పులు వరకు అతనిని చంపనని వరమిస్తాడు. కానీ వంద తప్పులు దాటితే మాత్రం శిక్షించక తప్పదని చెప్తాడు. ఇలా శిశుపాలుడు వంద తప్పులు పూర్తికాగానే, కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడుని హతమారుస్తాడు.
 
కృష్ణుడు ఎంతో కోపంతో సుదర్శన చక్రం ప్రయోగించడంతో అతని కృష్ణుని వేలుకు గాయమై రక్తం కారుతుంది. ఆ సమయంలో ద్రౌపదీ దేవి తన చీర కొంగును చించి, కృష్ణుని వేలుకు రక్షగా చుడుతుంది. తనను సోదరుడిగా భావించి ఆదుకున్నావు కాబట్టి.. నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా.. నన్ను తలుచుకుటే నిన్ను ఆదుకుంటానని అభయమిస్తాడు. ఇలా కృష్ణుడు.. ద్రౌపదికి ఇచ్చిన అభయమే.. ఈ సంఘటనే రక్షా భందనానికి నాందిగా నిలిచింది. 
 
ఆ తర్వాత కాలంలో ద్రౌపదిని నిండు సభలో కౌరవులు అవమానించాలని ప్రయత్నించినప్పుడు.. ఆ గోవిందుడు ద్రౌపది చుట్టిన కొంగును విప్పడం.. అదే ఆమెకు రక్ష కావడం జరుగుతుంది. అప్పటి నుంచే శ్రావణ పౌర్ణమి నాడు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు రాఖీ కట్టి రక్షగా ఉండమని కోరుతారు. అదే ప్రస్తుతం రక్షాబంధన్ పండుగగా మారిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

తర్వాతి కథనం
Show comments