Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవునికి కర్పూరం వెలిగించడంలో గల ఆంతర్యం ఏమిటి...? ఆ రోగాలు తగ్గుతాయా...?

దేవుళ్ల‌కు పూజ చేసే విష‌యానికి వ‌స్తే దీపం, అగ‌ర్‌బ‌త్తి వెలిగించడం, క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే. అయితే మన పూర్వీకులు చెప్పిన ఏ ఆచారం వెనుక అయినా శాస్త్రీయ కార‌ణాలు ఉంటాయి. పూజ సమయంలో వెలిగించే హార‌తి క‌ర్పూరం వెనుక కూడా కొన్ని శాస్త్రీయ కారణాలు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (15:46 IST)
దేవుళ్ల‌కు పూజ చేసే విష‌యానికి వ‌స్తే దీపం, అగ‌ర్‌బ‌త్తి వెలిగించడం, క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే. అయితే మన పూర్వీకులు చెప్పిన ఏ ఆచారం వెనుక అయినా శాస్త్రీయ కార‌ణాలు ఉంటాయి. పూజ సమయంలో వెలిగించే హార‌తి క‌ర్పూరం వెనుక కూడా కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. 
 
క‌ర్పూరం వాస‌న‌ను స్వ‌ర్గానికి చెందిన‌దిగా అభివ‌ర్ణిస్తారు. దీన్ని మండిస్తే ఎలాంటి బూడిద రాకుండా పూర్తిగా మండిపోతుంది కనుక దీన్ని దేవుళ్ల‌కు పూజ‌లు చేయ‌డంలో వినియోగిస్తారు. క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల దాని చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణంలో పాజిటివ్ ఎన‌ర్జీ వ‌చ్చి, ఈ క్ర‌మంలో ఆ ఎన‌ర్జీ అంతా మ‌న‌లోకి వెళ్లి మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. 
 
సినామోమ‌మ్ కంఫోరా అనే వృక్షం నుంచి తీసే ప‌దార్థంతో క‌ర్పూరం త‌యారు చేస్తారు. దీని నుంచి వ‌చ్చే పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల వ‌చ్చే పొగ‌తో ఆస్త‌మా, టైఫాయిడ్‌, త‌ట్టు, ఆందోళ‌న‌, త‌త్త‌ర‌పాటు, హిస్టీరియా, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. 
 
హారతి పొగ వ‌ల్ల చుట్టూ వాతావ‌ర‌ణంలో ఉండే బాక్టీరియా, క్రిములు, వైర‌స్‌లు నాశ‌న‌మ‌వుతాయి. అంతేకాకుండా దీని నుంచి జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంది. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. క‌ర్పూరాన్ని వెలిగిస్తే అది ఎలాగైతే పూర్తిగా మండిపోతుందో అలాగే దానికి ఎదురుగా నిల‌బ‌డి పూజ చేసిన వారిలో ఉన్న ఇగో కూడా అలాగే మండిపోతుంద‌ని అంటారు. ఈ క్ర‌మంలో అలాంటి వారు ప‌రిశుద్ధుల‌వుతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

తర్వాతి కథనం
Show comments