Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం-శుక్రవారం వరకు రావిచెట్టును ముట్టుకుంటే దరిద్రమా?

సోమవారం నుంచి శుక్రవారం వరకు రావిచెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుందట. శనివారం లేదా ఆదివారం రావిచెట్టును తాకితే అదృష్టమని పండితులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన కథ ప్రచారంలో ఉంది. పాల సముద్రం వలి

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:13 IST)
సోమవారం నుంచి శుక్రవారం వరకు రావిచెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుందట. శనివారం లేదా ఆదివారం రావిచెట్టును తాకితే అదృష్టమని పండితులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన కథ ప్రచారంలో ఉంది. పాల సముద్రం వలికిన సమయంలో లక్ష్మి దేవిని పెళ్లి చేసుకునేందుకు మహావిష్ణువు సిద్ధమవుతాడు. కానీ ఆమె కంటే అక్క జ్యేష్ఠ లక్ష్మి పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోనని చెప్తుంది. 
 
దీనిపై ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళ్తుంది. ముని చాలా పవిత్రంగా రోజు పూజలు, హోమాలతో శుచిగా వుండటంతో విసిగిపోయి.. జ్యేష్ఠ లక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది. దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టంలేక నన్ను ఇక్కడికి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణు మూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడ దొరకదు అని చెబుతాడు. 
 
ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరు రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారనే అని వరం ఇస్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుందని.. శని-ఆదివారాల్లో చెట్టును తాకితే అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments