తులసి చుట్టూ పురుషులు ప్రదక్షణ చేస్తే...? (video)

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (23:01 IST)
తులసి అనగానే చాలామంది కేవలం మహిళలు మాత్రమే పూజించాలి అనుకుంటారు. కానీ పురుషులు కూడా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానమాచరించి తులసికోట చుట్టు ప్రదక్షణ చేసినట్లయితే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పబడింది. మహిళలు శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటూ రోజూ తులసి మొక్కకు నీళ్ళుపోస్తారు సంధ్యాసమయంలో అక్కడ దీపం వెలిగించి కుంకుమ, పుష్పాలతో తులసిని అర్చిస్తారు. తులసిదళాలు, పుష్పాలు లేనిదే శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణ భగవానునికి అర్చన పరిసమాప్తి కాదని పురోహితులు అంటున్నారు. 
 
ఇతిహాసాల ప్రకారం తులసి కృష్ణుల వివాహం హిందూ సంప్రదాయంలో ప్రధానమైంది. తులసి వివాహ పర్వంగా దీనిని జరుపుతారు. ఆధునిక కాలంలో కూడా అన్ని ప్రాంతాలకు ఈ గాథ వర్తిస్తుంది. తులసి పత్రాలు ప్రతి పండుగనాడు, ప్రతి పవిత్ర సందర్భాలలోనూ వినియోగిస్తారు.
 
తులసిలో ఔషధ గుణాలు వున్నందున ఆ ఆకుల కషాయాన్ని జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బందులను తొలగించేందుకు వినియోగిస్తారు. పర్వదినాలలో దేవతలకు చేసే నివేదనలలోను, కొన్ని ప్రత్యేక విందులలోనూ అతిథులకు ఆహారపదార్థాలపై తులసి ఆకును వుంచి అందించడం సంప్రదాయం. 
 
పర్వదినాన చేసే భోజనంపైన, ప్రసాదంపైన తులసి పత్రం ఉంచడం ప్రేమకు, విధేయతకు చిహ్నం. ఆహారశుద్ధికి, విశ్వ చైతన్య శక్తికి ఆ పదార్థాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తున్నామనేందుకు చిహ్నం తులసిపత్రం. తీర్థంలో కూడ తులసిని విధిగా చేస్తారు. తులసి పత్రం త్యాగగుణానికి గుర్తు. పదార్థంపై తులసి ఆకు వుంచాక ఇచ్చేవానికి దానిపై ఎలాంటి హక్కు వుండదు. అందుకే వివాహ సమయాల్లో వధువు తల్లిదండ్రులు ఒక తులసి పత్రాన్ని లేదా బంగారంతో చేసిన తులసి పత్రాన్ని సమర్పిస్తుంటారు. 

 



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కొలంబో వెళ్లాలా? టీవీలో చూడొచ్చుగా: లోకేష్ పైన జగన్ విసుర్లు

పశు వికాస్ డే ద్వారా సర్వోత్తం సేవలో ముందంజలో ఉన్న SMFG ఇండియా క్రెడిట్

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు .. ఎందుకో తెలుసా?

వైకాపా హయాంలో ఎక్సైజ్, మైనింగ్ ఆదాయ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది : మంత్రి పయ్యావుల

మేనల్లుడి మెహందీ వేడుకలో నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన మేనమామ, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

15-02-2026 నుంచి 21-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Rahu Ketu Transit 2026: రాహు, కేతు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి లాభం..

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

తర్వాతి కథనం
Show comments