అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో...

Webdunia
బుధవారం, 31 జులై 2019 (22:30 IST)
వ్యక్తి యెుక్క పూర్వకర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు, సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి. ఈ వరుస క్రమంలో అన్ని జరుగువలసిందే.. అందరూ అనుభవించ వలసినవే. అవాంఛనీయ సంఘటనలు తటస్థించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది. 
 
1. ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దాని వల్ల ఉపయోగమేమీ లేదు. 
 
2. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
 
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
 
4. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
 
6. మన సంభాషణ యందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. 
 
7. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచు కొనవలనంటే ఆ దేవదేవుని మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
 
8. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు

బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments