Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదోష వ్రతం ఎలా చేయాలి.. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి?

Webdunia
సోమవారం, 25 జులై 2022 (20:44 IST)
ప్రదోషం వ్రతాన్ని ఆచరించే వారికి ఈతిబాధలు వుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని (ఓం నమ:శివాయ) జపం చేయాలి. 
 
ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. 
 
సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు, శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. 
 
మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.
 
మహా మృత్యుంజయ మంత్రము 
ఓం త్రయంబకం యజామహే 
సుగంధిం పుష్టి వర్ధనం 
ఊర్వారుకమివ బంధనాత్ 
మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే మంత్రాన్ని పఠించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

తర్వాతి కథనం
Show comments