Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం పెట్టుకుంటే?

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (22:14 IST)
ఆదివారం అనగానే ప్రతి ఒక్కరూ హాలిడే మూడ్‌లో ఉంటారు. అయితే, పంచాంగంలో ఆదివారం కూడా అనేక నియమనిబంధనలు పాటించవచ్చని బ్రహ్మణోత్తములు చెపుతున్నారు. ప్రధానంగా.. ఆదివారం అనే పదం ఆదిత్య వారం నుంచి పుట్టిదని సాహిత్య నిరూపణము.

సంస్కృతమున భానువారంగా పిలువబడుతోంది. ఇంకా చెప్పాలంటే భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో "రవివార్"గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. 
 
వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమనిబంధనలు పరిశీలిస్తే.. ఆదివారం ఉదయాన్నే సూర్యస్త్రోత్రం పఠించడంతో పాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిదని జ్యోతిష్కులు అంటున్నారు. సూర్యస్తోత్రం తర్వాత ఆలయ దర్శనం గావించి, ఎరుపు పువ్వులు స్వామికి సమర్పించడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు.
 
ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని, అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. భానువారమున సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి. గోధుమలతో తయారు చేసే వంటకాలు చపాతీ, పూరీ వగైరాలను ఆదివారం రోజున భుజించినట్లైతే ఆరోగ్యదాయకమని జ్యోతిష్య శాస్త్ర కర్తలు వెల్లడిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

తర్వాతి కథనం
Show comments