Webdunia - Bharat's app for daily news and videos

Install App

శని దోషం పోయేందుకు ఏడు శనివారాల పూజ... ఎలా చేయాలి?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (19:21 IST)
హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరినవారికి కొంగుబంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాందవుడు, అనాధ రక్షకుడు. మన జీవితంలో శని దేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చెయ్యాలి.
 
ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ ఆడవారు చేస్తే ఏదైన సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుండి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
1. శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వేంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యపు పిండి, పాలు ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటి పండు వేసి కలిపి చపాతిలా చేసి దానిని ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవునెయ్యి వేసి వెలిగించాలి.
 
2. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్దగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని , నువ్వులనూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.
 
3. అలాగే శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర ఆలయం దర్శంచి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్ని తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

2025.. బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025: మిథునరాశి విద్యారంగంలో ఏ మేరకు రాణిస్తుంది?

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

తర్వాతి కథనం
Show comments