Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యభగవానుడిని పూజిస్తే ఫలితమేమిటో..?

Webdunia
శనివారం, 17 జనవరి 2015 (15:36 IST)
సూర్యభగవానుడిని పూజిస్తే ఫలితమేమిటో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సూర్య భగవానుడి వల్లే రాత్రింబవళ్లు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. ఆయన అనుగ్రహం వల్లనే సమస్త జీవులకు ఆహారం లభిస్తోంది. ఆరోగ్యం కలుగుతోంది. అలాంటి మహిమాన్వితమైన సూర్య భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రుషులు ఇలా అంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని ఆరాధిస్తూ వచ్చారు. సూర్యభగవానుడిని పూజించి కోరిన వరాలను పొందినవాళ్లు ఎంతోమంది వున్నారు. వనవాస కాలంలో పాండవులు సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన నుంచి 'అక్షయపాత్ర' ను పొందారు. 
 
వనవాస కాలంలో వాళ్లని ఆకలిదప్పులు నుంచి ఈ అక్షయపాత్ర ఎంతగానో కాపాడుతూ వచ్చింది. అలాగే సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధించి, ఆయన నుంచి 'శమంతకమణి'ని వరంగా పొందాడు. ఇక రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరడానికి ముందు సూర్యభగవానుడిని పూజించిన శ్రీరాముడు విజయాన్ని సాధించాడు. ఆ శ్రీరాముడికి తన సహాయ సహకారాలను అందించిన హనుమంతుడు కూడా, సూర్యభగవానుడి నుంచి జ్ఞానసంపదను పొందాడు.
 
అలాంటి సూర్యభగవానుడికి అనునిత్యం మూడు వేళలలోను అర్ఘ్యం వదలి నమస్కరించడం వలన పాపాలు పటాపంచలై శుభాలు చేకూరతాయి. సంక్రాంతి నుంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే సూర్యభగవానుడిని ఆరాధించడం వలన అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments