Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mauni Amavasya: మౌని అమావాస్య, ఏం చేయాలి?

సిహెచ్
మంగళవారం, 28 జనవరి 2025 (23:16 IST)
మౌని అమావాస్య జనవరి 29న వస్తుంది. గంగానదిలో స్నానమాచరించేందుకు మౌని అమావాస్య ఉత్తమమైనది. ఈ  రోజున గంగానదీ స్నానమాచరించే వారికి సకల పాపాలు తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజున గంగానది అమృతంగా మారుతుందట. మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్యను ఉత్తరాదిన మాఘి అమావాస్యగా పిలుస్తారు. మాఘ అమావాస్య రోజున గంగాస్నానం ఆచరించేవారికి పుణ్యఫలితాలుంటాయి. 
 
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి. మౌని అమావాస్యను పురస్కరించుకుని ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాగ్, అలహాబాద్ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం యోగి సర్కారు అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మాఘమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా వుండే మౌనవ్రతాన్ని ఆచరించాలి. ఈ అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రోజంతా మౌనంగా వుండకపోయినా.. సూర్యోదయం తర్వాత మౌన అమావాస్య కోసం కాసేపు అలా మాట్లాడకుండా వుండటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య పాప గ్రహాల శాంతి కోసం వస్తుంది.
 
పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ.. వారి ఆశీర్వాదాలను పొందవచ్చు. శనీశ్వరుని మౌని అమావాస్య రోజున పూజ చేయొచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

తర్వాతి కథనం
Show comments