Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివలింగానికి కుంకుమ పెట్టకూడదు.. గంధం మాత్రమే ఎందుకు పెట్టాలి?

శివలింగాన్ని పూజించేటప్పుడు ముఖ్యంగా సోమవారాల్లో శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటాడు కాబట్టి.. ఆయనకు కుంకుమ సమర్పిస్తే.. ఎరుపు రంగ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (16:01 IST)
శివలింగాన్ని పూజించేటప్పుడు ముఖ్యంగా సోమవారాల్లో శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటాడు కాబట్టి.. ఆయనకు కుంకుమ సమర్పిస్తే.. ఎరుపు రంగులోని కుంకుమ శరీరంలోని చల్లదనాన్ని హరించి వేడిని పుట్టిస్తుంది. అందుకే శివునికి గంధాన్ని ఉపయోగించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
శివునికి సంపంగి పువ్వులు సమర్పించకూడదు. ఒక్కసారి తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు సాయం చేయాల్సిందిగా బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు. దీంతో బ్రహ్మ, సంపంగి పువ్వులను పూజకు పనికిరారని శాపం ఇచ్చినట్లు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వెలగపండు శివునికి ప్రీతి పాత్రమైనది. ఇది దీర్ఘాయుష్షుని సూచిస్తుంది.
 
శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. శివుని పూజలో బిల్వ పత్రం తప్పక వుండాలి. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అలాగే త్రిశూలానికి సంకేతం. వీటితో శివుని పూజ చేయడం ద్వారా పాపాలు హరించబడతాయి. అయితే బిల్వ పత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో చెట్టు నుంచి కోయకూడదు. పూజకు ముందు నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments