అవన్నీ నేనే భరిస్తూ వారిని కాపాడతాను: షిర్డి సాయి

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (22:47 IST)
1. ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని కాపాడతాను. 
 
2. నేను సర్వాంతర్యామిని. భక్తుడు పతనావస్ధలో ఉంటే, అతనిని కాపాడుటే నా విధి. ప్రతి ప్రాణిలో నన్ను దర్శిస్తూ, కరుణార్ద్ర హృదయంతో ఆదరించి పోషిస్తారో, వారు నన్నునిజంగా పోషించినవారౌతారు.
 
3. నన్ను స్మరిస్తున్నవారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను. నేను ఆత్మ సందర్శనాన్ని, కైవల్యాన్ని ప్రసాదించి నా ఋణము తీర్చుకుంటాను. అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను తీరుస్తాను.
 
4. నా కధలు అత్యంత శ్రద్దతో విని మననం చేయువారికి సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది. నిత్యం స్మరిస్తూ, నన్నే ధ్యానిస్తూ నా నామోచ్చారణ చేస్తుండేవారిని, నన్ను స్మరిస్తున్న వారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను.
 
5. ఎవరైనా తన సర్వస్వాన్ని నా సన్నిధానంలో సమర్పిస్తే , నిరంతరం నన్ను స్మరిస్తుంటే, తన అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని నశింపచేసుకుంటారు. అతడు ప్రాపంచికమైన అన్ని దుర్గుణాలకు దూరమై, పాపకృత్యముల నుండి విముక్తి పొందుతాడు. అతడికి నిరంతర ఆనందం లభిస్తుంది.
 
6. ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ, తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుండి ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని పొందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: క్రికెట్ ఆడిన నారా లోకేష్.. ఫోటోలు, వీడియోలు వైరల్

Donald Trump: అక్రమ వలసదారులకు చెక్.. ఐసీఈ అమలు.. ఐడీ కార్డులు చూపించాల్సిందే

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు

దాబాలో మహిళపై సామూహిక అత్యాచారం.. సీసీటీవీలో అంతా రికార్డ్.. చివరికి?

ఒంగోలులో పొట్టేళ్ల పందాలు.. ఇరవై ఐదు పొట్టేళ్లతో పందాలు..

అన్నీ చూడండి

లేటెస్ట్

సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చేస్తే.. గురువారం రావడం?

భోగి పండుగ 2026.. బలి చక్రవర్తికి ఆహ్వానం.. ఇలాంటి రోజు 2040 వరకు రాదు..

భోగి రోజు షట్తిల ఏకాదశి.. అరుదైన సర్వార్థ, అమృత సిద్ధి యోగం.. నువ్వులతో ఇలా చేస్తే?

భోగి పండుగ రోజున వేరు శెనగలు, మొక్కజొన్న, నువ్వులు, బెల్లం మంటల్లో సమర్పిస్తే..?

13-01-2026 మంగళవారం ఫలితాలు - రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి..

తర్వాతి కథనం
Show comments