Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామకోటి రాస్తే ఫలితం ఏమిటి? ఎలా రాయాలి..? పద్ధతులేంటి?

రామకోటి రాయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. రామకోటి రాయడం ద్వారా సంకల్పం ప్రాప్తిస్తుంది. రామకోటి రాయాలనుకుంటే.. ముందుగా దైవ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. మంచి రోజు చూసుకుని రామకోటి పుస్తకాన్ని రాయడం చ

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (15:09 IST)
రామకోటి రాయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. రామకోటి రాయడం ద్వారా సంకల్పం ప్రాప్తిస్తుంది. రామకోటి రాయాలనుకుంటే.. ముందుగా దైవ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. మంచి రోజు చూసుకుని రామకోటి పుస్తకాన్ని రాయడం చేయాలి.  రామకోటి రాసేందుకు కలం విడిగా పెట్టుకోవడం మంచిది. రామకోటి రాసేటప్పుడు అనవసర చర్చలు, ఇతర వ్యాపకాలు ఉండకూడదు. ఏకాంత ప్రదేశం ఎంచుకోవాలి.  
 
రాసే పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో పూజించాలి. శ్రీ రామ అష్టోత్తరశతనామావళి చదివి రాయం ప్రారంభించాలి. లక్ష నామాలు రాయటం పూర్తయిన ప్రతిసారీ శక్తి కొలది పూజ, నివేదన చేసి ఆ ప్రసాదాన్ని నలుగురికీ పంచాలి. అలాగే కోటి నామాలు రాసిన తర్వాత కూడా చేయాలి.
 
అనుకోని కారణాల ద్వారా రాయడం ఆపాల్సి వస్తే..  సరి సంఖ్య వరకు రాసి పుస్తకం మూసి నమస్కరించి వెళ్లాలి. పని పూర్తికాగానే కాళ్ళు, చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయాలి. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామయ్యకు లేదా ఏదైనా రామాలయంలో అప్పగించాలి. అదీ వీలుకాకుంటే ప్రవహించే నదిలో వదిలిపెట్టాలని పండితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments