Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు దేవుడు... భార్య కోసం బాధపడటం ఏంటి...?

రాముడు, కృష్ణుడు దేవుళ్లు అంటారు కదా. భగవంతుడు కూడా సామాన్య మానవుడిలా గురుకులాల్లో చదవడం, భార్య కోసం బాధపడటం ఇలాంటి లౌకిక కర్మలనెందుకు చేస్తాడు? ఆయనకు మానవుడిలా కోరికలు, పుణ్యపాపాలు ఉండవు కదా. వారు మన మాదిరి మానవులైతే మనం వారిని పూజించడం ఎందుకు? వారి

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (17:05 IST)
రాముడు, కృష్ణుడు దేవుళ్లు అంటారు కదా. భగవంతుడు కూడా సామాన్య మానవుడిలా గురుకులాల్లో చదవడం, భార్య కోసం బాధపడటం ఇలాంటి లౌకిక కర్మలనెందుకు చేస్తాడు? ఆయనకు మానవుడిలా కోరికలు, పుణ్యపాపాలు ఉండవు కదా. వారు మన మాదిరి మానవులైతే మనం వారిని పూజించడం ఎందుకు? వారి కథలను పురాణాల్లో చదవడం వల్ల మానవజాతికి ఏం ప్రయోజనం కలుగుతుంది? అని నా మిత్రుడు అడుగుతుంటాడు. దీనికి సమాధానం ఏమిటి?
 
రాముడు, కృష్ణుడు శ్రీమహావిష్ణువు అవతారాలు. భగవంతుడు ఏ కోరికతోనూ లౌకిక కర్మలను మానవుడిలా చేయలేదు. ఆయనకు ముల్లోకాలలోనూ కర్తవ్యమంటూ ఏదీ లేదు.  అలాగే ఆయన పొందంది కాని పొందవలసింది కానీ ఏమీ లేదు. అయినా ఆయన కర్మలను ఆచరించాడు. మనుష్యులు అన్నివిధాలా ఆయన ప్రవృత్తిని అనుకరిస్తున్నారు కాబట్టి తన విధులలో ఏమరుపాటు లేకుండా ఆయన కర్మలననుష్టించాడు. అలాకాకపోతే రాముడే ఇలా చేశాడు కృష్ణుడే ఇలా చేశాడు అని మనుష్యులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. 
 
భగవంతుడు కర్మలను ఆచరించకపోతే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి. అనేక రకాల సంకరాలు ఏర్పడుతాయి. వాటితో ప్రజలు నాశనాన్ని పొందుతారు. అందువల్ల వారు కర్మలను మానవులు చేసినట్లే చేశారు. వారు కారణజన్ములుగా అవతారం స్వీకరించినవాళ్లు. ప్రారంబ్దంతో పుట్టినవాళ్లం మనం. వారి కథలను చదవడం వల్ల మనకు ఆత్మశక్తి, నైతికశక్తి పెరిగి జీవనవిధానం బాగుపడుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..

తర్వాతి కథనం
Show comments