అలాంటి వారిని చూసేందుకు యమునికి కూడ శక్తి చాలదట...

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని చెపుతారు. ఐతే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాల్లో శ్రీమహావిష్ణువును ఉసిరి

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (22:00 IST)
పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని చెపుతారు. ఐతే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాల్లో శ్రీమహావిష్ణువును ఉసిరితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. 
 
ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరి పూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. 
 
ఈ కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారని విశ్వాసం. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. 
 
తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.
 
ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

36 -37 డిగ్రీల సెల్సియస్‌: హైదరాబాదులో పెరిగిన ఉష్ణోగ్రతలు

భారత నౌకాదళం భద్రత మధ్య ఇండియాకు బయలుదేరిన ఇంధన నౌకలు

ఇరాన్ అగ్ర నాయకులను హతమార్చాల్సిందే : ట్రంప్‌కు నెతన్యాహు పిలుపు

ఇరాన్ పైన యుద్ధం చేయమన్నది మీరే కదా పీట్: రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్

కొలంబియాలో కూలిన హెర్క్యులస్ విమానం.. 66 మంది మృతి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

తర్వాతి కథనం
Show comments