Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (21:17 IST)
తిరుమలలో సోమ‌వారం రాత్రి 7.00 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణ కాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. 
 
గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగు మాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ క‌టాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 
 
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments