Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య మండలం నుంచి మాటలు వినబడతాయ్... 5097 సంవత్సరంలో... బ్రహ్మంగారి కాలజ్ఞానం

బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన చెప్పిన వాక్కులు ఇప్పటికే కొన్ని జరిగిపోయాయి. మరికొన్ని జరుగుతాయంటూ ఆయన చెప్పినవి. * రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (21:06 IST)
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన చెప్పిన వాక్కులు ఇప్పటికే కొన్ని జరిగిపోయాయి. మరికొన్ని జరుగుతాయంటూ ఆయన చెప్పినవి.
 
* రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
* సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
* విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది.
* గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది.
* సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
* నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
* విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
* ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.
* కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు.
* ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
* 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
* నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
* 5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
* మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
* పట్ట పగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
* అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.
* మహానంది మరుగున మహిమలు పుడతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments