Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఏంటి ఫలితం?

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (10:30 IST)
Lord Shiva
కార్తీక సోమవారాలు శివునికి ప్రత్యేకం. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకమైనది. కార్తీక సోమవార వ్రతం చేయడం అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున రుద్ర నమకం, రుద్ర చమకం పఠించడం ద్వారా రుద్రాభిషేకం చేయడం సర్వశుభాలను ప్రసాదిస్తుంది. ఈ రోజున ఉపవాసం వుండి నక్షత్రాలను చూసిన తర్వాత ఆహారం తీసుకోవాలి. 
 
ఈ వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి ఈ లోకంలో అనేక సుఖాలను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి చేకూరుతుంది. కార్తీక సోమవారం పూట ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం ఉత్తమం. కార్తీక సోమవారాల్లో "ఏకాదశ రుద్రాభిషేకం" చేయడం శుభప్రదంగా భావిస్తారు. 
 
అందువల్ల చాలా మంది శివ భక్తులు ఏకాదశ రుద్ర అభిషేకం చేస్తారు. సోమవారాల్లో శివునికి రుద్రాభిషేకం చేయించి.. దీపాలను వెలిగిస్తారు. అలాగే దీప దానాలు చేస్తారు. కార్తీక మాసంలో శివ, విష్ణువులను పూజించడం.. ఆలయంలో దీపం వెలిగిస్తే 1000 యుగాల్లో చేసిన పాపాలు అన్నీ నశిస్తాయి. అందుకే అన్ని దానాల కంటే కార్తీక మాసంలో దీపదానం చేయడం ఉత్తమమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

తర్వాతి కథనం
Show comments