Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్పవృక్ష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్నఇత‌ర రాష్ట్రాల కళాబృందాలు

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (13:37 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం వివిధ‌ రాష్ట్రాల నుండి విచ్చేసిన క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శనలు ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, దాస‌సాహిత్య ప్రాజెక్టు, అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో వాహ‌న‌సేవ‌ల్లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.  
 
మ‌హ‌రాష్ట్ర - డోల్ ప‌తాక్‌ : మ‌హ‌రాష్ట్ర తుల్జాపూర్‌కు చెందిన ఎమిజి కాటిగ‌ర్ మ‌హ‌రాజ్‌ బృందంలోని 60 మంది మ‌హిళా క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న ఎంతో విన‌సొంపుగా ఉంటుంది. వీరు గ‌త 24 సంవ‌త్స‌రాలుగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో వివిధ‌ వాహ‌న‌సేవ‌ల‌లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. 
 
ద‌క్షిణ క‌ర్ణాట‌క - కోలాటం, య‌క్ష‌గానం, భ‌ర‌త‌నాట్యం : ద‌క్షిణ క‌ర్ణాట‌క పుత్తూరుకు చెందిన  శ్రీ రామ మ‌హిళా భ‌జ‌న మండ‌లిలోని  20 మంది బృందం అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌లలో  కోలాటం, య‌క్ష‌గానం, భ‌ర‌త‌నాట్యం  ప్ర‌ద‌ర్శించింది. ఈ బృందంలోని క‌ళాకారులు శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. మొద‌టిసారిగా అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.
 
పాండిచ్చేరి - జ‌ల్రాటం మ‌రియు భ‌ర‌త‌నాట్యం :  పాండిచ్చేరికి చెందిన పుదునై భ‌ర‌దాల‌యా భ‌జ‌న మండ‌లికి చెందిన 20 మంది మ‌హిళా బృందం జ‌ల్రాటం, భ‌ర‌త‌నాట్యం భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.
 
హోసూరు - భ‌ర‌త‌నాట్యం : త‌మిళ‌నాడు హోసూరుకు చెందిన అభిన‌య నాట్యాల‌య డాన్స్ అకాడ‌మికి చెందిన 32 మంది క‌ళాకారులు ఉన్నారు. ఇందులో వివిధ‌ దేవ‌తా మూర్తుల అలంకారంతో చ‌క్క‌టి భ‌ర‌త‌నాట్యం ప్ర‌ద‌ర్శించారు. 
వైజాగ్ - కోలాటం : వైజాగ్‌కు చెందిన శ్రీ‌మ‌తి భ‌వాని ఆధ్వ‌ర్యంలో సీతారామ కోలాట స‌మితికి చెందిన 11 మంది మ‌హిళా బృందం చ‌క్క‌గా కోలాట నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

తర్వాతి కథనం
Show comments