Webdunia - Bharat's app for daily news and videos

Install App

"త్రినేత్రునితో పోరాటమా? భస్మమైపోతావు. వెంటనే ఇక్కడ్నుంచి పారిపో"

ఒకసారి దేవేంద్రుడు కైలాసానికి వెళ్ళాడు. దేవేంద్రుని పరీక్షించాలనుకున్న పరమశివుడు, మారు వేషంలో అక్కడికి వచ్చి నిలబడ్డాడు. మారువేషంలో వచ్చిన శివుని కనిపెట్టలేకపోయిన దేవేంద్రుడు ''నువ్వెవరవు?!'' అని అడిగాడు. అందుకాయన ఎలాంటి జవాబు చెప్పలేదు. ఇంద్రుడెన్ని

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:14 IST)
ఒకసారి దేవేంద్రుడు కైలాసానికి వెళ్ళాడు. దేవేంద్రుని పరీక్షించాలనుకున్న పరమశివుడు, మారు వేషంలో అక్కడికి వచ్చి నిలబడ్డాడు. మారువేషంలో వచ్చిన శివుని కనిపెట్టలేకపోయిన దేవేంద్రుడు ''నువ్వెవరవు?!'' అని అడిగాడు. అందుకాయన ఎలాంటి జవాబు చెప్పలేదు. ఇంద్రుడెన్నిసార్లు రెట్టించి, రెట్టించి అడిగినప్పటికీ, మారువేషంలో ఉన్న శివుడు జవాబు చెప్పకపోవడంతో, కోపావేశంతో ఊగిపోయిన దేవేంద్రుడు, ఆయనపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. 
 
అయితే ఆ వజ్రాయుధం శివుని దగ్గరకు చేరే లోపు తుత్తునియలై బూడిదకుప్పగా మారిపోయింది. ఆ మరుక్షణం శివుడు రౌద్రాకారంతో ప్రత్యక్షమయ్యాడు. స్వామిని చూడగానే గజగజలాడిపోయిన ఇంద్రుడు, తనని మన్నించమంటూ ఆయన పాదాలపై పడతాడు. అప్పుడు ఆవేశాన్ని తగ్గించుకున్న శివునికి విపరీతంగా చెమట పట్టింది. అప్పుడు శివుని శరీరం నుంచి కిందకు పడిన ఒక చెమట బిందువు నుంచి ఓ బాలకుడు ఉద్భవించాడు. అతడే జలంధరుడు.!
 
ఆ బాలుడి దగ్గరకు తీసుకున్న సముద్రుడు ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. సముద్రుని పెంపకంలో పెరిగి పెద్దవాడైన జలంధరుడు సకలవిద్యల్లో నిష్ణాతుడయ్యాడు. యుక్తవయస్కుడైన జలంధరుడు, కాలనేమి కూతురైన బృందను పెళ్ళి చేసుకున్నాడు. కాలగమనంలో జలంధరునికి అహం ఎక్కువై, సకల లోకాలపై దండెత్తాడు. ఆయా లోకాలను స్వాధీనం చేసుకున్న జలంధరుడు ఇంద్రునిపైకి దండెత్తి, స్వర్గలోకాన్ని సైతం స్వాధీనం చేసుకున్నాడు. జలంధరుని చేతిలో ఓటమి పాలైన ఇంద్రుడు తనను కాపాడమని, విష్ణుమూర్తిని శరణు వేడుకోగా, జలంధరునితో శ్రీ మహావిష్ణువు ఎన్నేళ్ళపాటు పోరాడినప్పటికీ ఫలితం కనిపించలేదు. అనంతరం దేవేంద్రుడు కైలాసానికి వెళ్ళి శివుని వేడుకున్నాడు. ఈశ్వరుడు, దేవేంద్రునికి అభయ ప్రదానం చేశాడు. 
 
ఇంద్రుడు కైలసానికి వెళ్ళాడన్న సంగతిని విన్న జలంధరుడు, కైలాసంపై దండయాత్రకు బయలుదేరాడు. అటువంటి పనులు వద్దని బృంద ఎంతగా అడ్డుపడినప్పటికీ జలంధరుడు పెడచెవిన పెట్టాడు. జలంధరుడు కైలాసానికి చేరుకున్న సమయంలో అక్కడొక వృద్ధుడు జలంధరునికి తారసపడ్డాడు. ఆ ముదుసలిని చూసిన జలంధరుడు ''నువ్వెవ్వరవు?'' అని ప్రశ్నించాడు. జలంధరుని ప్రశ్న విన్న ఆ ముదుసలి కూడా నువ్వెవరవు? అని జలంధరునికి ఎదురుప్రశ్న వేశాడు.
 
''నేను జలంధరుడను. సముద్రరాజు కుమారుడను. ప్రస్తుతం శివునితో యుద్ధం చేయడానికై బయలుదేరి వచ్చాను'' అని జలంధరుడు పలికాడు. అందుకా వృద్ధుడు "త్రినేత్రునితో పోరాటమా? భస్మమైపోతావు. వెంటనే ఇక్కడ్నుంచి పారిపో" అని అన్నాడు. ''పారిపోవడమా? నా శక్తి ఏమిటో, త్వరలోనే మీకు చూపిస్తాను'' అని జలంధరుడు చెప్పడంతో ఆ వృద్ధునికి కోపం నషాళానికి అంటింది. జలంధరుని వైపు కోపంగా చూసిన ఆ వృద్ధుడు, తన కుడికాలితో నేలపై గీతలు గీస్తూ.. ఓ చక్రాన్ని చిత్రించాడు. ఆ చక్రభాగాన్ని పెళ్ళగించి పైకి లేపిన ఆ వృద్ధుడు " దీనిని నీ తలపై పెట్టుకుని మోయగలవా"? అని అడిగాడు. 
 
''ఇదేమన్నా పెద్ద బ్రహ్మాండమా ఏమిటి?'' అని పలికిన జలంధరుడు, ఆ చక్రాన్ని ఎత్తి మెల్లగా తన భుజాలపై పెట్టుకుని, తలపైన పెట్టిన మరుక్షణమే జలంధరుని ఆ చక్రం రెండు చీల్చుతుంది. మునివేషంలో ఉన్న శంకరుని చేతిని అది అలంకరించింది. అనంతరం త్రినేత్రుని మూడవ కన్ను నుంచి వెలువడిన అగ్నిజ్వాలల్లో జలంధరుని సైన్యమంతా మాడి మసైపోయింది. తద్వారా ఆ దుష్టరాక్షసుని బారి నుంచి బయటపడ్డ సకలలోకవాసులు శివునిపై పుష్పవర్షాన్ని కురిపించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments