Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం రోజు నిమ్మకాయ, లవంగాలతో ఇలా చేస్తే...?!

గురువారం రోజున నాలుగు నిమ్మకాయలు, లవంగాలతో కాని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పురాణాలే చెబుతున్నాయి. మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతుంటాము. ఇందులో ఉండే విటమిన్ రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా అందాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. నిమ్మ వల్ల

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (12:26 IST)
గురువారం రోజున నాలుగు నిమ్మకాయలు, లవంగాలతో కాని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పురాణాలే చెబుతున్నాయి. మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతుంటాము. ఇందులో ఉండే విటమిన్ రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా అందాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇది సైన్స్. అయితే మనం నిమ్మకాయలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు తప్పవట.
 
మంత్ర తంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు. గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని పండితులు చెపుతారు. వ్యాపారం బాగా జరుగకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తరువాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళుతుందని నమ్మకం.
 
మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మచెట్ట ఉండటం ద్వారా ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సమస్యలు లేకుండా అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకొని కింద నుంచి పైవరకు చూస్తూ దిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెను తిరిగి చూడకూడదు. ఇలా చేస్తే దిష్టి పోతుంది. గురువారం ఇవన్నీ ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తాయి. కుటుంబ సమస్యలు ఏవన్నా ఉంటే నిమ్మకాయ, లవంగాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments