కార్తీక మాసంలో ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:13 IST)
కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివుని ఆరాధించిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. ఈ కార్తీక మాసం పూర్తిగా ఈశ్వరుని పూజించడం శుభదాయకమని చెప్తున్నారు. 
 
చాలామంది శివుభక్తులు పరమేశ్వరుని తులసి మాలలతో ఆరాధిస్తుంటారు. ఈ మాసంలో తులసి కోటను పూజిస్తే పరమేశ్వరుని పూజించినట్టవుతుందని నమ్మకం. కనుక ఇంట్లో తులసి కోట లేని వారు వెంటనే కోటను అమర్చుకుంటే మంచిది. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసుకుని ఈశ్వరుని అలంకరించి వారికి నచ్చిన పిండి వంటలను నైవేద్యాలుగా సమర్పించి.. శివనామాన్ని జపిస్తూ పూజలు చేస్తే.. అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయని పండితులు చెప్తున్నారు. 
 
అలానే కార్తీక మాసంలో వచ్చే అష్టమినాడు కొబ్బరి కాయను పూజకు ఉపయోగించకూడదు. అంతేకాకుండా ఈ మాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజూకో అధ్యాయం పారాయణం చేస్తే సకలసౌభాగ్యాలు చేకూరుతాయి. శనిగ్రహదోషాలతో బాధపడేవారు ఈ కార్తీక మాసమంతా పరమేశ్వరునికి పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారు గొలుసు కోసం వృద్ధురాలిని హత్య- ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దంపతుల దారుణం

జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు అరకు చలి ఉత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం

అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశారు.. ఎక్కడ?

అక్రమ మైనింగ్‌ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి

రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

తర్వాతి కథనం
Show comments