Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశ లేనివారికి దుఃఖ బాధలుండవు, ఆశ పడే వారికి లేని బాధలుండవు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (23:01 IST)
అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది. పోటీపడే వారంతా విజేతలు కావాలనే ఆశిస్తారు. గెలిచేది ఒక్కరే అయినా పోటీపడటం మానరు. గెలవలేమేమో అనే నిరాశ వారిలో తలెత్తనే కూడదు. అలాగే అర్హత, స్థాయి, స్థోమత లేని వాటికోసం ఆశ పడటం అనర్ధదాయకం. ఆశకు అంతుండదంటారు అనుభవజ్ఞులు. అనంతమైన ఆశ తన వెంట పడే వారిని పరుగులు పెట్టిస్తుంది. 
 
పరుగెత్తేకొద్దీ తీరిక లేకుండా చేసి ఇంకా తనవైపు ఆకర్షితుల్ని చేయడం దాని లక్షణం. ఆశించింది దొరికితే మరికొంత కావాలని మనిషి కోరుకుంటాడు. అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు. అంతేతప్ప ఇక్కడితో ఆగుదాము అనుకోడు. ప్రమిదలో వత్తి లాంటిది ఆశ. అది ఉండేంతవరకు చమురు పోస్తే వెలుగునిస్తుంది. మునిగేంతగా పోస్తే, చీకటినే మిగుల్చుతుంది. ఆశ మనిషికి లోబడి ఉండాలి. కానీ మనిషి ఆశకు లోబడిపోకూడదు. ఆశ లేనివారికి దుఃఖ బాధలుండవు. ఆశ పడే వారికి లేని బాధ లుండవు. 
 
తమకున్నదానితో సంతృప్తి పడేవారు సంతోషం చవిచూస్తారు. అలా కానివారు కోల్పోతారు. అవగాహన, ప్రణాళిక, పట్టుదల, తగిన కృషి ఉంటే ఆశలు వాటంతట అవే నెరవేరతాయి. ఆశ అనేక రూపాలలో ఉంటుంది. మనిషి నిరాశ, అత్యాశ, దురాశల్లో కూరుకుపోవడం మంచిది కాదు. నిరాశ అతణ్ని నిర్వీర్యుడిగా చేస్తుంది. నిరాశ ఉందని గుర్తించిన తర్వాత ఏదో ఒక విధంగా దానిని తొలగించుకోవాలి. ఆ స్థానంలో ఆశావహ దృక్పధం పెంచుకోవాలి. 
 
అత్యాశ కలిగిన వాళ్లు సుఖసంతోషాలకు దూరమవుతారు. దురాశ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చెడు ఆశల మూలాన వాటిల్లే అనర్ధాలకు విరుగుడు లేదు. లోకంలో అసంతృప్తికి మించిన దారిద్ర్యం లేదు. సంతృప్తిపరుడు పొందే సుఖాన్ని ఎంతటి చక్రవర్తి అయినా పొందలేడు. ఆశలు మనసులో ఉండాలి. వాటిని నెరవేర్చుకునే ఆలోచనలు మెదడులో ఉండాలి. వాటిని ఫలవంతం చేసుకునే కృషి, మనిషి చేతుల్లో ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

లేటెస్ట్

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

తర్వాతి కథనం
Show comments