Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతి వేలికి దేవుని ఉంగరం ఎలా ధరించాలి... ధరిస్తే ఏ నియమాలు పాటించాలి

మనలో చాలామంది ఉంగరాల్లో, చైన్‌లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటాము. ఆ ప్రతిమలలో దైవత్వం ఆపాదించుకుంటాం. దేవుడి ఉంగారాలు, గొలుసులు ధరించగానే సరికాదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉంగ

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (16:55 IST)
మనలో చాలామంది ఉంగరాల్లో, చైన్‌లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటాము. ఆ ప్రతిమలలో దైవత్వం ఆపాదించుకుంటాం. దేవుడి ఉంగారాలు, గొలుసులు ధరించగానే సరికాదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉంగరాలు కాని, గొలుసులు కాని దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతకరీత్యా ధరించాలి. అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉంటాయి.
 
ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు, కాళ్ళు గోర్ల వైపు ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం చేతివేళ్ళు, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. ఇక స్త్రీలు అయితే బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసి భద్ర పరుచుకోవాలి. ఆ సమయంలో ధరించకూడదు. అంతేకాదు భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. మాంసాహారం భుజించకూడదు. ఇక మగవారు ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు. అంతేకాదు మద్యపానం కూడా అంతే. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కల ఉంగరాన్ని ధరించాలి. లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments