Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండు చేయించుకుని తిరుమలలో నకిలీ నోట్లతో దొంగనోట్ల ముఠా....

తిరుపతి, తిరుమలలో నకిలీ దొంగనోట్ల ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజు లక్షల్లో ఈ ముఠా సభ్యులు దొంగనోట్లను తయారుచేసి మార్చేస్తున్నారు. అది కూడా శ్రీవారి భక్తుల ముసుగులో. ఎక్కడో కాదు 24 గంటల పాటు జనసంచారం ఉండే బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలోనే ఈ తతంగమ

Webdunia
శనివారం, 18 జూన్ 2016 (19:30 IST)
తిరుపతి, తిరుమలలో నకిలీ దొంగనోట్ల ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజు లక్షల్లో ఈ ముఠా సభ్యులు దొంగనోట్లను తయారుచేసి మార్చేస్తున్నారు. అది కూడా శ్రీవారి భక్తుల ముసుగులో. ఎక్కడో కాదు 24 గంటల పాటు జనసంచారం ఉండే బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలోనే ఈ తతంగమంతా సాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో దొంగనోట్ల ముఠాపై ప్రత్యేక కథనం.
 
ప్రతి రోజు 50 నుంచి 70 వేలమంది భక్తులు. ఇంతమంది భక్తులు వచ్చే ప్రాంతం మరెక్కడా లేదు. ప్రపంచంలోనే అది పెద్ద ధార్మిక సంస్థలో తిరుమల ఒకటి. అయితే అలాంటి తిరుమల, తిరుపతిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతోంది. కొంతమంది అసాంఘిక వ్యక్తులు ధార్మిక క్షేత్ర ప్రతిష్టను దిగజార్చేస్తున్నారు.
 
బెంగుళూరు, చెన్నైలకు చెందిన కొంతమంది తిరుపతికి చేరుకుని ఈ ప్రాంతంలోనే ముఠా సభ్యులుగా ఏర్పడి దొంగనోట్లను తయారు చేస్తున్నట్లు సమాచారం. పట్టణ నడిబొడ్డునే అపార్టుమెంట్లలో బాడుగ ఉంటూ దొంగనోట్లను తయారుచేస్తున్నట్లు సమాచారం. తయారు చేసిన దొంగనోట్లను భక్తుల ముసుగులో తలనీలాలను సమర్పించి గుండుతోనే తిరుగుతూ వాటిని మార్చేస్తున్నారు. ప్రతిరోజు లక్షల్లోనే దొంగనోట్లను ఈ ముఠా మారుస్తున్నారని తెలుస్తోంది. ఈ ముఠా ఆలయాలనే దొంగనోట్లను మార్చడానికి ఎంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. భక్తుల లాగా ఆలయాల వద్దకు వెళ్ళి తమ వద్ద ఉన్న దొంగనోట్లను ఇస్తూ ఈజీగా వాటిని మార్చేస్తున్నారు. ఇవి తెలియని షాపు యజమానులు వాటిని తీసుకుంటున్నారు. అంతేకాదు ఆ దొంగనోట్లనే తిరిగి నిజమైన భక్తులకు ఇస్తున్నారు.
 
ముఠా సభ్యులు 50మందికిపైగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరు ప్రతిరోజు ఒక్కొక్కరు 10వేల రూపాయల దొంగనోట్లను మార్చాలన్న నిబంధనను కూడా పెట్టుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అసలు  కన్నా నకిలీ నోట్లే ఎక్కువగా ఉన్నాయని బ్యాంకు అధికారులు గుర్తించారు. వీరు మారుస్తున్న దొంగనోట్లు ఎటిఎంలలో కూడా వస్తున్నాయంటే వీరి చేతివాటం ఏ పాటితో అర్థమవుతుంది. తిరుమలలో కూడా ఈ మధ్యకాలంలో నకిలీ ముఠా సభ్యులు ప్రతిరోజు తిరుగుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. తితిదేకి సంబంధించిన షాపులతో పాటు, ప్రైవేటు షాపులలో ఈ దొంగనోట్లను మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. పోలీసులకు ఇలాంటి సమాచారం అందుతున్నా పట్టనట్లు ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments