Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ఏకాదశి... పేలాల పిండి తినడంలో పరమార్థం ఏమిటి...?

తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందిక

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (13:55 IST)
తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందికి తెలియదు. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు. 
 
పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల తొలి పండుగ దినాన వారిని గుర్తుచేసుకోవడం అనేది ఇందులో ఉన్న ప్రధాన అంశం. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అంతకు మించి శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments