Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలుగు తాత్కాలికమే .. చీకటే శాశ్వతం!

Webdunia
గురువారం, 31 జులై 2014 (18:41 IST)
వెలుగు తాత్కాలికం. వెలుగంటే ఒక దీపం కావచ్చు, లేదా వెలిగే విద్యుత్ బల్బు కావచ్చు, లేదా కాంతికి అతిపెద్ద మూలాధారమైన సూర్యుడు కావచ్చు. లేదా ఏదో ఒకటి తగలబడిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మండుతున్నాయి. ఒక విద్యుత్ బల్బు వాడుతుంటే అది బహుశా కొన్ని వందల గంటలు పని చెయ్యవచ్చు. అలాగే సూర్యుడు కూడా కొన్ని బిలియన్ సంవత్సరాలలో పూర్తిగా కాలిపోతాడు. మరి అన్నీ కాలిపోయినప్పుడు మిగిలేది చీకటే కదా. 
 
మానవులు వెలుతురంటే ఎందుకు ఇష్టపడతారంటే, వారి ఇంద్రియాలు ఆ విధంగానే నిర్మాణమై ఉంటాయి కాబట్టి. సూర్యుడు అస్తమించి చీకటి పడితే, రాత్రి వేళ తిరిగే కీటకాలు, పక్షులు, ఇతర జంతువులూ రాత్రంతా హుషారుగా ఉంటాయి. రాత్రి సంచరించే జంతువుల కళ్లు, వాటి గ్రహణ శక్తి లాంటిది. మనిషి కళ్లూ, చూపూ ఆ నిశాచర జంతువుల్లాగా ఉంటే మనిషి కూడా వెలుతురుని ఇష్టపడరు. చీకటి మంచిది అనుకుంటారు. అంటే వెలుతురుపై మీకు వ్యామోహానికి కారణం మన శరీర వ్యవస్థ అలా తయారుకావడమే. కానీ వెలుగు ఎప్పుడూ ఉండదు. ఒక విద్యుత్ దీపమైనా లేదా ఈ గ్రహం మీద జీవనానికి మూలకారణమైన సూర్యకాంతి అయినా ఒక రోజున చీకటి మయం కావాల్సిందే. 
 
నిజానికి ఈ ఉనికి మొత్తం చీకటి మాత్రమే. పగటి వేళ మీరు తలెత్తి ఆకాశంలోకి చూస్తే సూర్యుడు ప్రబలంగా కనపడతాడు కాబట్టి మీకు ఉనికి ఉన్నది ఉన్నట్టు కనపడదు. అదే రాత్రి గనుక మీరు పైకి చూస్తే మీకు అనేక నక్షత్రాలు చిన్న రేణువులుగా కనిపిస్తాయి. కానీ, అతి విశాలమైన ఆకాశమంతా చీకటి మయం, మీరు అది గమనించలేకపోతున్నారు. అంతులేని ఈ చీకటిలో అక్కడక్కడ కొంచెం వెలుగు ఉంటుంది. మీరు కూడా స్వల్పమైన ఉనికే కాబట్టి, విశాలమైన చీకటిని కాకుండా, స్వల్పమైన ఈ కొంచెం వెలుతురుతో మిమ్మల్ని మీరు అన్వయించుకుంటారు. మీ స్వల్ప ఉనికిని వేరే స్వల్ప ఉనికితో అన్వయించుకుంటారు. కానీ ఈ ఉనికిలో చీకటి అతి పెద్దది.
 
ఈ ఉనికిలో ఎక్కడ చూసినా ఉన్నది పూర్తి చీకటి మాత్రమే. అంటే చీకటి మాత్రమే అన్ని చోట్లా ఉండగలదు. 'శివ' అన్న పదానికి అసలైన అర్థం 'ఏమీ లేదు', లేదా 'శూన్యం'. ఈ ఉనికి మొత్తమంతా శూన్యం. ఆ శూన్యమే చీకటి. 'ఉన్నది' సృష్టి, అది ఒక చిన్న అంశం. సృష్టి కానిది చాలా విశాలమైనది. ఏమీ లేని దాని ఒడిలోంచే ఏదో పుడుతుంది. పుట్టడం మళ్లీ అదృశ్యమవడం - ఇలా సృష్టించిన పాలపుంతలన్నీ వాటిలో అవే విలయమై, ఉనికి లేకుండా పోతాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments