Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో పెట్టుకుంటే...?

పూజా మందిరాలలో శివ కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి అసలు ఈ పటాన్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు. కానీ శివ కుటుంబంతో ఉన్న

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (19:17 IST)
పూజా మందిరాలలో శివ కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి అసలు ఈ పటాన్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు. కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచటం చాలా మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 
 
పార్వతీ పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు. 
 
విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయురారోగ్యాలను, విజయాలను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం  పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments