Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదర్శ దినచర్య ఎలా వుంటుందో తెలుసా?

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (14:14 IST)
ప్రతిరోజూ మనం చేసే దినచర్య ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అప్పుడే జీవితంలో లక్ష్యసాధన సులువవుతుంది. అనైతిక చర్యలకు దూరంగా ఉండాలి. ఇదే ఇతరులకు ఆదర్శమవుతుంది. 
 
సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. కులదేవత, ఇష్టదేవతకు నమస్కరించుకుని శుచిగా స్నానమాచరించాలి. తర్వాత ప్రార్థ, ధ్యాన  పారాయణలు చేయాలి. ఇష్టదేవతలకు పూజ, నైవేద్యం తర్వాత ఆహారం తీసుకోవాలి. 
 
తర్వాత జీవనోపాధికి కావలసిన ధనసంపాదనకై చేయవలసిన పనులను ధర్మలోపం లేకుండా చేయాలి. తిరిగి సాయంకాలం ఇంటి పనంతా అయిన తర్వాత కుటుంబంలోని వారంతా ఒకచోట చేరి, కొంతసేపు ధ్యానం, ప్రార్థన మొదలైనవి చేయాలి. తిరిగి పడుకునే ముందు మరోసారి దేవతా ప్రార్థన చేయాలి. 
 
అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి. వ్రతాలను, పండుగలను అర్థవంతంగా ఆచరించాలి. జీవితంలో ఒక్కసారైనా తీర్థ క్షేత్రాలను విధి పూర్వకంగా సందర్శించాలి. పేదలకు దానధర్మాలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యం వ్యక్తిగత, సామాజిక జీవితంలో నైతిక పరిశుద్ధి కోసం ప్రయత్నించాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments