Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులము కన్నా మంచి గుణము గొప్పది : వేమన

Webdunia
బుధవారం, 6 మార్చి 2013 (10:44 IST)
FILE
పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు
మాట కన్నా నెంచ మనసు దృఢము
కులము కన్నా మిగుల గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ

గురి కుదరని పైపై పూజ కంటే నిశ్చలమైన జ్ఞానం ముఖ్యం. మారే మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం. సామాజికంగా ఏర్పడిన లక్షణం స్వభావతః ఏర్పడిన లక్షణం ఎన్నదగినది. బాహ్యంగా చేసే పనులు సరే, వాటికి మూలాలు లోపల ఉన్నాయా, లేదా అని చూసుకొమ్మంటున్నాడు వేమన. పాత మాటే కావచ్చు. కాని ఎప్పటికి పాతపడని మాట అని గుర్తించుకోవాలి.

పూజ అంటే తెలియనిదెవరికి? అర్చన, దేవుడిని కొలవడం. బుద్ధి అంటే బోధ చేత ప్రకాశించేది. బోధ అంటే జ్ఞానం, అంటే వస్తువు యొక్క యదార్థ గుణాన్ని తెలిపేది. నిదానం అంటే నెమ్మది, ఓపిక అనే అర్థాలున్నా ఇక్కడ కారణం, మూల హేతువు.

అలాగే మాట అంటే పైకి చెప్పేది. మనస్సు అంటే చిత్తం. ఇది జీవాత్మకంటే భిన్నమైంది. జ్ఞానం పుట్టేది దీనిలోంచే. పైకి చెప్పే మాటకు పునాది మనస్సులో ఉంటే, ఆ మాటకు కాంతి ఉంటుంది. మనసులో పుట్టిన జ్ఞానం స్థిరమైనది అని సారాంశం.

ఇక కులం, ఇది మనిషి పుట్టిన తర్వాత వచ్చిందే. సామాజికంగా దీనిలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. కాని మౌలికంగా మనిషి గుణమే గొప్పది. ఈ అర్థం వచ్చే పద్యాలు వేమన కోకొల్లలుగా చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

'మిస్ వరల్డ్ 2025' విజేత విజయ రహస్యమేంటో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

Show comments