ఎవరి ప్రత్యేకత వారిదే.. నిరాశ చెందకండి!

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (16:25 IST)
ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదేనని మీరు గుర్తించాలి. ఒకరికి ఓ రంగంలో ప్రతిభ ఉంటే మీకు మరో రంగంలో ఉంటుంది. అందుకని వాళ్లు ఫలానా పని బాగా చేస్తారు కానీ నాకు రాదని నిరాశ చెందకండి. ప్రయత్నిస్తే మీరూ చేయగలరు. మిమ్మల్ని వెనక్కి నెట్టే ఇలాంటి విషయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి చాలు విజయం మీదే అవుతుంది.
 
ముందుగా మిమ్మల్ని వెనక్కి నెట్టే అంశాలను విడిగా ఓ పేపర్‌పై రాసుకోండి. ఏ విషయంలో మీరు బలహీనులవుతున్నారని గుర్తించండి. మీకంటే అవతలి వారు దేనిలో ప్రత్యేకంగా ఉన్నారో గమనించండి. వాటిని క్రమబద్ధంగా రాసుకుని వాటిలో మీ వద్ద ఏవి లేవో తెలుసుకోండి. తర్వాత వాటిని ఎలా జయించాలో ఆలోచించండి. పట్టుదల వదలకుండా ప్రయత్నించి చూడండి.
 
అలాగే మీ బలహీనతల్ని చూసి వెక్కిరించే వారిని పట్టించుకోవద్దు. మిమ్మల్ని మీరు ఉన్నత స్థానంలో నిలుపుకోండి. ఈ చర్యలు చేపడితే మీరు విజేతగా నిలిచేందుకు మార్గం సులభమైనట్టే. ప్రతి ఒక్కరిలో ఏదో ఓ రంగంలో ప్రతిభ ఉంటుందని మనం తెలుసుకోవాలి. అయితే ఆ రంగాలలో మన ప్రతిభను మెరుగు పరుచుకునేందుకు కృషి చేయండి. చక్కని ఫలితాలను పొందుతారు. 
 
తోటి వారిని మాటలతో బాధపెట్టకండి. చక్కని మాటతీరుతో, స్నేహ భావంతో మెలగండి. మీ వద్ద ఉన్న లోపాలు దూరంగా వెళ్లిపోతాయి. అందరూ మీ చుట్టూ చేరాలని మీ మనసులో ఉందా? అది నెరవేరాలంటే మీ పనిలో శ్రద్ధపెట్టి ఏకాగ్రతతో పనిచేయండి. మీ ప్రవర్తనను ఎప్పటికప్పుడు చూసుకోండి. తద్వారా అందరూ మీ చుట్టూ చేరతారు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పారిశుద్ధ్య మహిళా కార్మికురాలి నిజాయికితీ బంగారు బహుమతి

అమెరికా ఒత్తిడికి లొంగిపోయిన ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం : సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిటీ

YouTuber అరుణ్‌ పన్వర్‌కి కట్నంగా రూ. 71 లక్షలు, 21 తులాల బంగారం?

మా దేశ గోప్యతతో ఆడుకోలేరు .. మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

ఎర్రచీర లోని ఓ షాట్‌ను అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా లో కాపీ కొట్టారు : సుమన్ బాబు

తెలుగులో సారా అర్జున్.. ధురంధర్ హీరోయిన్ మళ్లీ అదరగొడుతుందా?

Sri Chidambaram : ఇగోస్టులందరితో ఎలా పనిచేయాలో నేర్చుకున్నా : వినయ్ రత్నం

Prabhas: కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు

Show comments