ఇతడిని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది...?

Webdunia
గురువారం, 28 జనవరి 2016 (17:03 IST)
నాలుగేళ్ల క్రితం నాకు పరిచయమైన అతడికి నేను చాలా దగ్గరయ్యాను. చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటాం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. అతడు కూడా ఐటీలో జాబ్ చేస్తున్నాడు. గత రెండేళ్లుగా అతడి మనస్తత్వంలో తేడా కనబడుతోంది. నేను నా సహచర పురుష ఉద్యోగులతో మాట్లాడుతూ కనిపిస్తే చాలు... నాపై మండిపడుతున్నాడు. అలాగే నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో లిస్టు చెప్పినట్లు చెపుతున్నాడు.
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్


నాకిష్టమైన దుస్తులను వేసుకుంటే దుర్భాషలాడుతున్నాడు. ఇక నా క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాలంటే అతడి పర్మిషన్ తీసుకోవాల్సిందే. మొత్తంగా చూస్తే నాపై అతడి డామినేషన్ జరుగుతోంది. నా అలవాట్లు, దుస్తుల అలంకరణ మొత్తం అతడు ఎలా చెబితే అలా మారిపోతుంది. ఇతడిని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది...?
 
ప్రేమికుల్లో ఒకరిపట్ల ఒకరికి మక్కువ ఉంటుంది. తమ ప్రియుడు, ప్రేయసి మరొకరితో మాట్లాడుతుంటే(ఎక్కువసేపు, గంటలకొద్దీ) కాస్త ఉడుక్కోవడమూ ఉంటుంది. తనను ఎక్కడ అశ్రద్ధ చేస్తుందోనన్న భయం ఉంటుంది. అందువల్ల నిత్యం వారు తమ ఆలోచనలను నిత్యం ప్రేయసి చుట్టూ తిరుగుతుంటాయి. ఐతే శ్రద్ధ, ఇష్టం చూపించడం వేరు... డిక్టేట్ చేయడం వేరు. తన కనుసన్నల్లోనే అన్నీ ఉండాలనుకోవడం నియంత తత్వం. అది ఎవరికీ మంచిది కాదు. 
 
ఇకపోతే ప్రేమిస్తున్న వ్యక్తిపై నమ్మకం లేనపుడు అతడు ప్రేమికుడు అనిపించుకోడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు పెంపొందాలంటే ఉండాల్సింది ప్రేమాప్యాయతలు, నమ్మకం తప్ప అనుమానాలు, అపార్థాలు కాదు. కనుక అతడి కండిషన్లకు మీరు ఎలాంటి ఇబ్బందిపడుతున్నారో అతడికి విడమర్చి చెప్పండి. అలాగే మీరు కూడా అతడికి కండిషన్లు పెడితే అతడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోని చూసుకోమనండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

రెండేళ్లలో 416మందితో డేటింగ్.. మహిళ షాకింగ్ స్టోరీ

హైదరాబాద్‌లో భూముల వేలం తిరిగి ప్రారంభం.. ప్రభుత్వం ఆమోదం

అనుమానం.. భార్యను వేధించాడు.. ఆపై రోకలితో బాది హత్య.. స్టేటస్ కూడా పెట్టాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

పి.వి.నరసింహారావు రాసిన కథ ఆధారంగా గొల్ల రామవ్వ రాబోతోంది

Chandrabose: ఉస్తాద్ భగత్ సింగ్ లో బ్యాక్ గ్రౌండ్ గీతాన్ని కసరత్తు చేస్తున్న చంద్రబోస్

కన్నె పిట్టారో.. పాట పాడుతూ డెకాయిట్ పూర్తిచేశానన్న మృణాల్ ఠాకూర్

NTR: మరోసారి బ్రేక్ పడిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్

Show comments