నా భర్తకు శీఘ్రస్ఖలనం.. సెక్స్‌థెరపీ వద్దంటూ నన్ను అనుమానిస్తున్నారు.. ఏం చేయాలి?

Webdunia
గురువారం, 14 మే 2015 (15:22 IST)
నా వయస్సు 28 యేళ్లు. చాలా అందంగా ఉంటాను. వివాహమై నాలుగేళ్లు అవుతోంది. నా భర్తకు వివాహమైనప్పటి నుంచి శీఘ్రస్ఖలన సమస్య ఉంది. ఆదిలో ఫరవాలేదనిపించినా మెల్లగా ఈ సమస్య ఎక్కువైంది. క్షణాల్లో వీర్యం స్కలనమైపోతోంది. దీంతో ఇద్దరం తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నాం. అయితే, నాకు సెక్స్ కంటే ఆయనే ముఖ్యం. ఆయన కొన్ని నెలలుగా నాతో సరిగా ఉండటం లేదు. పైగా నన్ను అనుమానిస్తున్నారు. నాతో మాట్లాడరు. ఉద్యోగం సరిగా చేయరు. డాక్టర్ వద్దకు వెళ్ళి సెక్స్‌థెరపీ చేయించుకుందామంటే రానంటున్నారు. డాక్టరు వద్దకు వెళ్ళి చికిత్స తీస్కోవడం నాకు ఆనందం కోసం కాదు. తనకి బాధ తగ్గడం కోసం. ఎంత చెప్పినా హాస్పిటల్‌కి రారు. ఏం చేయాలి.?
 
ఇలాంటి సమస్య ఏ ఒక్కరికో కాదు.. ప్రపంచంలోని పురుషుల్లో కోటాను కోట్ల మందికి ఉంది. పైగా ఇది తగ్గని సమస్య ఏ మాత్రమూ కాదు. శీఘ్రంగా అంటే త్వరగా అయ్యే స్ఖలనాన్ని ఆపి, అంగస్తంభన కాలాన్ని పెంచే సెక్స్‌థెరపీలో కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ సాధన చేయడం వల్ల సమస్య నుంచి విముక్తులు కావొచ్చు. కొన్ని టెక్నిక్స్ భర్త విడిగానూ, మరికొన్ని భార్య సహకారంతో చెయ్యాలి. ఫర్‌ఫార్మెన్స్ ఆంగ్జైటీ వల్ల శీఘ్రస్ఖలన సమస్య ఏర్పడుతుంది. 
 
శీఘ్రస్ఖలనం తగ్గకపోతే ఫర్‌ఫార్మెన్స్ ఆంగ్జైటీ ఇంకా ఎక్కువ అవుతుంది. రెండూ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఫర్‌ఫార్మెన్స్ ఆంగ్జైటీ తగ్గడానికి, సమస్య పట్ల సరైన జ్ఞానం, విశ్లేషణ, సెక్స్ సైకాలజీ, నార్మల్ సెక్స్ రెస్పాన్స్ సైకిల్‌ని తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే సైకోథెరపీ ఉండనే ఉంది. శీఘ్రస్ఖలన సమస్యకు మానసిక కారణాలు విపరీతమైన ఆందోళన, భయం, టెన్షన్, అంగస్తంభన నిలిచి ఉండే కాలంపై అపోహలు, అజానం నిన్నటిలా త్వరగా అయిపోతుందన్న ముందస్తు భయం, ఎక్కువసేపుండి తీరాలన్న స్వీయ డిమాండ్, భాగస్వామి తిరస్కారం, సహకరించకపోవడం లేదా డిమాండ్ చేయడం వంటి కారణాలు ఉంటాయి. 
 
అదేసమయంలో భార్యను సంతృప్తి పరచలేక పోతున్నాననే బాధలోంచి వచ్చిన కోపం, చిరాకు, ఆత్మన్యూనత మిమ్మల్ని అనుమానించే స్థాయికి తీసుకెళ్ళింది. సెక్స్ కంటే తన ప్రేమే ముఖ్యమని భరోసా ఇవ్వండి. సమస్య లైంగిక ఆరోగ్యం కిందికి వస్తుంది. ఇతర శారీరక అనారోగ్యాల్లాగా దీన్ని అంతే సాధారణ విషయంగా పరిగణించి చికిత్స తీసుకోవాలని చెప్పండి. ఇందులో సిగ్గు పడాల్సిన అవసరమేమీ లేదని చెప్పండి. మీ వారిని సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్ళండి. ఇద్దరికీ కౌన్సెలింగ్, సెక్స్ - సైకోథెరపీ చాలా అవసరం. కొద్ది రోజుల చికిత్సతో తగ్గిపోయే సమస్యను జీవితాంతం నరకంగా మార్చుకోవద్దు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు