చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడకండి!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (19:16 IST)
మీకు సంబంధించినంత వరకు జరిగే చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడకండి. అలా అయితేనే మీరు మీ కెరీర్‌లో విజయం సాధించగలుగుతారు. లేదంటే మనసులో సంకోచాలు విజయ బాటకు అడ్డు తగులుతుంటాయి. జీవితంలో ఎత్తు పల్లాలు, లాభనష్టాలు ఉంటాయని గుర్తుంచుకోండి.
 
మిమ్మల్ని ఎవరైనా నలుగురిలో బాధపెడితే అది ఓ పెద్ద అవమానంగా భావించకండి. దానిలో ఉన్న మంచిని తీసుకోండి. లేదా అలాగే వదిలేయండి. సరదాగా మామూలుగా అందరితో మాట్లాడండి. అప్పుడు వారి తప్పు వారికే తెలుస్తుంది. 
 
ఏ విషయమైనా సర్దుకోవడం నేర్చుకోండి. ఇలా చేయడంతో మీపై మీకు విశ్వాసం పెరగడమే కాకుండా మనసు తేలికవుతుంది. ఉదాహరణకు లత తన ఆఫీసు పనిలో చిన్న తప్పు చేసింది. దానిని తన పైఅధికారి సరిదిద్దాడు. అప్పట్నుంచీ తనను అందరూ అదోలా చూస్తున్నారని మనసులో కుమిలి పోవడం ప్రారంభించింది.
 
ఇలాంటి విషయాలు మన చుట్టూ తరచూ జరుగుతుంటాయి. అయితే నిజానికి వాళ్లు ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయి ఉంటారు. మనం మాత్రం దానిని మనసులో గుర్తు చెసుకుంటూ మనశ్సాంతిని దూరం చేసుకుంటుంటాం. ఇలా చేయడంతో ఏకాగ్రతా లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయాన్నైనా ఎక్కువ సేపు ఆలోచించకండి. మీరు చేసిన పని తప్పైతే దానిని మరోమారు రాకుండా చూసుకోండి.
 
ఇటువంటి తప్పులు, పొరపాటులు అందరి జీవితాలలో సహజమైనవేనని మీ మనసుకు చెప్పుకోండి. మిమ్మిల్ని అస్తమానం సూటిపోటి మాటలతో బాధపెట్టేవారి గురించి ఆలోచించకండి. వారి గురించి, వీరి గురించి ఆలోచించడం మానేసి మీరు, మీ అభివృద్ధికి కావలసిన మార్గాలను అన్వేషించండి. తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?

అల్లుడే మామకు, భార్యకు నిప్పంటించాడా? అసలేం జరిగింది?

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments