నగరాల్లో భార్యాభర్తల మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:10 IST)
నగరంలో జీవిస్తున్నారా? ఉద్యోగాలకే అంకితమవుతున్నారా? భార్యా భర్తల మధ్య అస్సలు పడట్లేదా..? చిన్న చిన్న విషయాలకే జగడాలొచ్చేస్తున్నాయా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. నగరాల్లో నివసించే యువ జంటల మధ్య మాటలు కరువవడమే దంపతుల మధ్య అన్యోన్యతకు.. చిన్న చిన్న జగడాలకు కారణమవుతున్నాయని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. మాటలు కరువు కావడంతోనే దంపతులకు విడాకులు కోరుకుంటున్నారు. ఇద్దరి మధ్య సమన్వయ  లోపంతో పచ్చటి కాపురాలు కూలిపోతున్నాయని మానసిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
నేటి సమాజంలో భార్యా, భర్త ఇద్దరూ కష్టపడి పనిచేస్తేనే కుటుంబం సాఫీగా సాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. తద్వారా ఇద్దరికీ శారీరక శ్రమ తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాల్లో పనిచేసి వచ్చిన వారు అలసటకు గురవుతున్నారు. దీంతో ఎదుటి వారి మాటలు వినే ఓపిక అస్సలు ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే ఘర్షణ పడుతున్నారు. చిన్న కుటుంబాలు కావడంతో సర్ది చెప్పేందుకు పెద్దవాళ్లు అందుబాటులో ఉండటం లేదు. వారికి విషయం తెలిసే సరికి వివాదం కాస్తా ముదిరి పోతుంది. చివరకు విడాకుల వరకు దారితీస్తుంది. 
 
ఇలా విడాకుల వరకు వెళ్లడం కంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
* దంపతులు ఏం చేయాలంటే.. దంపతులు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఇంట్లో మాత్రం అవన్నీ మర్చిపోవడం మేలు. భాగస్వాములు ప్రేమగా మాట్లాడుకోవడం అవసరం. కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్‌టాప్, కంప్యూటర్ల జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. సెల్ ఫోన్‌కు సైతం దూరంగా ఉండటం మేలు చేస్తుంది. 
 
* దంపతుల మధ్య వివాదాలు చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవడం ఉత్తమం. వాటిని కొనసాగిస్తే అనురాగం దెబ్బతింటుంది. ఒక విషయాన్ని పదే పదే సాగదీయడం మంచి పద్ధతి కాదు. చిన్న చిన్న ఘర్షణలు పెద్ద వారి దృష్టికి తీసుకువెళ్లడమే మేలు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటే పెద్దవి కాకుండా ఉంటాయి. కార్యాలయానికి వెళ్లిన తర్వాత భోజన విరామ సమయంలో ఒకరినొకరు పలుకరించుకోవడంతో అనుబంధం బలపడుతుంది. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీకాకుళం వాసులకు శుభవార్త - పలు రైళ్లకు స్టాపింగులు

ఏపీకి రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ.. ఎందుకు?

కీలక నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు - ఇకపై వాట్సాప్‍‌లో హాల్ టిక్కెట్లు

రూ.1.44 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ కేసులో ట్విస్ట్.. ఏంటది?

కన్నడ నటుడు దర్శన్ భార్యకు అసభ్య సందేశాలు... ఇద్దరు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వైజాగ్ కాదా?

బట్టలు వేసుకుని బయటకు వెళ్లాలి.. నగ్నగా కాదు : నటి రోహిణి

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో యాక్షన్ పోలీస్ ఆఫీసర్ గా సంయుక్త,

Suhas: సుహాస్ చిత్రం హే భగవాన్! షూటింగ్ పూర్తి

Show comments