Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడికి అతడే కావాలనిపిస్తుంటే... ఆమెకి ఆమే కావాలనిపిస్తే దారేదీ?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (15:50 IST)
హోమోసెక్సువల్ టెండెన్సీ. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే అది విపరీతమైన ఆలోచనా విధానమే. మనిషి పుట్టి పెరిగేటప్పుడు తను ఏ సొసైటీలోనున్నది అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ సొసైటీ ద్వారా ఏది మంచిది, ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానం నేర్చుకుంటాడు మనిషి. తను పెరిగిన ఇల్లు, తల్లిదండ్రులు, స్నేహితులు, పాఠశాల, బంధువులు తదితరాల వంటి వాతావరణంతో మానసిక, శారీరక వికాసం జరుగుతుందని మానసిక వైద్యనిపుణులు పేర్కొన్నారు. 
 
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే ప్రస్తుతం ఇలాంటి సమస్యతో బాధ పడుతున్నవారి సంఖ్య అంచనాలకు మించే వుందంటున్నారు పరిశోధకులు. వీరిలో మొదట్లో ఏదో కొత్తకొత్తగా వుందని హోమోసెక్స్‌కు అలవాటు పడిన తర్వాత మళ్లీ మామూలు జీవితం అంటే అందరిలాగే పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలన్న కోరిక వుందని అత్యధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారు. 
 
మనిషి యొక్క మానసిక వికాసం జరిగే క్రమంలో కొన్ని లోపాలు ఏర్పడితే వాటిని డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటారు. ఇది మన సామాజిక పరిస్థితులకు ఆమోద యోగ్యం కాదు. కాబట్టి తప్పకుండా అలాంటి ఆలోచనను మానుకోవాలి. అలా మార్చుకోవడానికి సైకియాట్రిస్ట్, సెక్స్ కౌన్సిలర్స్ సలహాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరు నెలలనుంచి ఒక సంవత్సరంవరకు వారి పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవలసివుంటుంది. అప్పుడు అవగాహనా దృష్టిని, ధోరణిని మార్చుకుని నిదానంగా సమస్యను పరిష్కరించుకోవచ్చును. 
 
ఈ సమస్యకు మాత్రలు, టానిక్కులు పని చేయవు. ఇలాంటివారికి క్రమం తప్పకుండా చికిత్స, కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మారిపోయి సుఖవంతమైన సంసార జీవితాన్ని గడుపుతున్నారు. కాని మళ్లీ తాము వైవాహిక జీవితానికి పనికి వస్తామా లేదా అనేది వారిలోని అనుమానం. ఆ అనుమానమే పెనుభూతమై వారిని మానసికంగా క్షోభకు గురిచేస్తుందని పరిశోధకులు అంటారు. కాని ఇలాంటివారికి సైకియాట్రిస్ట్, సెక్స్ కౌన్సిలర్ల సలహాలు ఎంతో లాభాదాయకం కాగలదని వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం