సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అరటి పండు నైవేద్యం పెడితే..?

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (17:02 IST)
సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. కుమార స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 
 
అలాంటి సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా చెప్పబడుతోంది. ఈ నెల 28న వచ్చే ఆ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. 
 
ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేసి, ఉపవాస దీక్షను చేపట్టి, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజా మందిరంలో గల సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. 
 
పాయసం, కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. దానిమ్మ, అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఖమేనీపై ట్రంప్ సేన దాడి, కాలేయం డ్యామేజ్, కాలు పోయింది, కోమాలో వున్నాడా?

సర్ నేమ్‌ను ఎస్‌గా మార్చుకున్న విజయ్ కుమారుడు.. ఇన్‌స్టాలో అన్ ఫాలో కూడా చేశాడు

రాజకీయాల్లోకి అడుగుపెడతాను.. కానీ ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ కాలేదు.. అలేఖ్య

మార్చి 16 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య టార్చర్ భరించలేక భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

Show comments