"శ్రీరామ" స్మరణతో పాపాలన్నీ పోగొట్టుకోండి.

Webdunia
గురువారం, 12 జూన్ 2014 (17:49 IST)
దుష్టశిక్షణ శిక్షరక్షణార్థమై చైత్రశుద్ద నవమినాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. 
 
ఒకసారి పార్వతీదేవి పరమశివుని-కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. అని విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌నకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.
 
అందుకు పరమేశ్వరుడు- 'శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామతత్సుల్యం రామనామ వరాననే ||' అని మూడుసార్లు స్మరించినట్లైతే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, అభేదస్వరూపులమైన మావల్ల భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు పార్వతికి మంత్రోపాసన చేశాడు.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తివశంకరుడే ఈ తారకమంత్రం. ఈ మంత్రాన్ని వారి కుడిచేవిలో చెప్పి నారికి చెప్పడం ద్వారా సద్గతి కలిగిస్తారన్నది విశ్వాసం. 
 
"రామ"యనగా రమించుట అని అర్థం. కావున ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న "ఆ శ్రీరాముని" కనుగొనుచుండవలెను. రామనామధ్యానముతో పాపాలన్నీ దహించివేయబడునని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు : అజ్ఞాతం వీడిన అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా... అనుచరులతో జీవన్ రెడ్డి

నేను బ్రతికే వున్నాను బాబోయ్... పాపం ఇజ్రాయెల్ ప్రధానికి ఎన్ని కష్టాలో? కొత్త వీడియో

హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తెలంగాణలోని నిజామాబాద్‌లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

నేషనల్‌ హైవే-48పై పల్టీ కొట్టిన సిలిండర్లతో కూడిన లారీ.. ఎత్తుకెళ్లిన స్థానికులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Vastu for Wearing a Watch: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి వాచ్ కట్టాలో తెలుసా?

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Show comments