ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున శివుడిని పూజిస్తే..

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:02 IST)
ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా పిలుస్తారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. 
 
సాధారణంగా ప్రతి నెలలోను అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది.
 
ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమగతులు లభిస్తాయి. ఈ రోజున శివుని పూజతో పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మాల్దీవుల స్టైల్‌లో సముద్ర తీర ప్రాంతం.. సూర్యలంక, పులికాట్, వైజాగ్ బెల్ట్‌ను..?

అమరావతికి చట్టపరమైన ఆమోదం వుంది.. కొత్త ఎయిర్ పోర్ట్ అవసరం: నారా లోకేష్

జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు?

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

లేటెస్ట్

05-01-2026 సోమవారం ఫలితాలు - ధనసహాయం, చెల్లింపులు తగవు...

04-01-2026 నుంచి 10-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

04-01-2026 ఆదివారం ఫలితాలు - మొండి బాకీలు వసూలవుతాయి.. ఖర్చులు సంతృప్తికరం...

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Show comments