Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి మట్టితో లేదా వెండితో చేసిన ఇంటి ప్రతిమను ఇస్తానని మొక్కుకుంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. శనివారం వ్రతమాచరించి శ్రీవారిని పూజించే వారికి సొంత

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:58 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. శనివారం వ్రతమాచరించి శ్రీవారిని పూజించే వారికి సొంతింటి కలే కాదు.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. భక్తులతో సాటివాడిలా మాట్లాడే వెంకన్నను శనివారం పూజిస్తే, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే.. వెండితో చేసిన ఇల్లును ఇస్తానని, లేదా మట్టితో చేసిన ఇంటి ప్రతిమను ఇస్తానని స్వామివారికి మొక్కుకోవాలి. 
 
మట్టితో లేదా వెండితో చేసిన ఇంటిని.. పూజగదిలో ఉత్తరం వైపున ఉంచి ఆ ఇంటినే శనివారం పూజించాలి. ఇంటి బొమ్మపై పువ్వులు అక్షింతలు వేసి.. ఆ ఇంటి ముందు నేతితో దీపమెలిగించి పూజించడం ద్వారా శ్రీవారి అనుగ్రహంతో ఇంటికల సాకారం అవుతుంది. ఇంటినే పూజిస్తూ.. సొంత గృహాన్ని ప్రసాదించు తండ్రీ అంటూ గోవిందుడికి పూజ చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. 
 
ఇంటి ప్రతిమ ముందు ఐదు పిడికెలు బియ్యం పిండి, పాలు, బెల్లం మూడింటిని ఉండలా చేసుకుని.. బియ్యం పిండి ముద్దను ప్రమిద వలె చేసుకుని.. అందులో రెండు దూది వత్తులను ఉంచాలి. కరిగించిన నెయ్యినే అందులో పోయాలి. ఈ దీపం భూమి, నీరు, ఆకాశం, తేజస్సుకు ప్రతీక. దేహానికి ప్రాణశక్తిగా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని పూజగదిలో ఉంచిన ఇంటి ప్రతిమ ముందు వుంచి దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులతో కూడిన ఇతరత్రా ప్రతికూలతలు తొలగిపోయి.. సొంతింటి కల నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు.
 
ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత "ఓం వేంకటేశాయ" అనే నామాన్ని 108 సార్లు పఠించడం ద్వారా ప్రగతి కాలానికి దైవం, వృద్ధికారకుడు అయిన శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో వచ్చే శనివారం ప్రారంభించాలి. లేకుంటే ఏ మాసంలో వచ్చే శనివారమైనా ప్రారంభించాలి. సొంతింటి కల నెరవేరాలని శ్రీవారి శరణాలను ఆశ్రయించి వేడుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా ఆస్తి, ఉద్యోగం, లౌకిక కోరికలు నెరవేరుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

Pawan Kalyan: నారా దేవాన్ష్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ - ఎందుకో తెలుసా? (video)

దావోస్‌‌లో అమ్మాయిల బుకింగ్స్ అదుర్స్ - రూ.కోట్లలో వ్యాపారం?

అన్నీ చూడండి

లేటెస్ట్

25-01-2025 శనివారం దినఫలితాలు : వాహనం ఇతరులకివ్వవద్దు...

24-01-2025 శుక్రవారం దినఫలితాలు : అనుభవజ్ఞుల సలహా తీసుకోండి...

23-01-2025 గురువారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత...

22-01-2025 బుధవారం దినఫలితాలు : కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి...

జనవరి 22: కృష్ణపక్ష కాలాష్టమి.. మిరియాలు, గుమ్మడి, కొబ్బరి దీపం వెలిగిస్తే..?

తర్వాతి కథనం
Show comments