మంగళవారం శ్వేతార్క హనుమను పూజిస్తే?

గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును శ్వేతార్క గణపతిగా పూజిస్తుంటారు. శ్వేతార్క మూలంపై వినాయకుని ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. గణపతి విశిష్టలతో కూడిన ఈ శ్వేతార్క మూలంపై హనుమ రూపాన్ని తీర్చిదిద్దిం

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (11:32 IST)
గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును శ్వేతార్క గణపతిగా పూజిస్తుంటారు. శ్వేతార్క మూలంపై వినాయకుని ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. గణపతి విశిష్టలతో కూడిన ఈ శ్వేతార్క మూలంపై హనుమ రూపాన్ని తీర్చిదిద్దించి, ఆ రూపానికి మూల మంత్రంతో ప్రాణప్రతిష్ట జరిపి పూజించడం వలన పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి.
 
జాతకంలో ఏర్పడే బాలారిష్టాలు పన్నెండేళ్ల వయసు నిండేంత వరకు పిల్లలను పీడిస్తుంటాయి. ఈ దోషాల కారణంగా పిల్లలు తరచుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అంతేకాకుండా ప్రమాదాలకు, భయాలకు లోనవుతుంటారు. కాబట్టి ఈ దోషాలు తొలగించడానికి శ్వేతార్క ఆంజేనేయ స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
తెల్లజిల్లేడు వేరుపై హనుమ రూపాన్ని తయారుచేసుకుని సింధూరంతో అలకరించి పూజ మందిరంలో ఉంచుకుని నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ఈ పూజలో హనుమాన్ చాలీసాను పదకొండుసార్లు పఠించాలి. ఇలా చేయడం వలన హనుమ అనుగ్రహం లభించడంతో పాటు దోషాలు కూడా తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pithapuram: పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధం అవుతున్న జగన్మోహన్ రెడ్డి

Guntur: టీడీపీ ఎమ్మెల్యే, మేయర్‌ల మధ్య కోల్డ్ వార్

Amaravati: అమరావతి రాజధాని భూ సమీకరణ రెండో దశ ప్రారంభం

Krishna River: కృష్ణానదిపై రూ.816 కోట్లతో అద్దాల వంతెన

గృహ జ్యోతి పథకం 52.82 లక్షల మంది లబ్ధిదారులకు చేరింది.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాల సీజన్ ప్రారంభం

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

తర్వాతి కథనం
Show comments