హనుమంతుడిని గురువారం మల్లెపూలతో పూజిస్తే..!

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (17:52 IST)
హనుమంతుడిని గురువారం మల్లెపూలతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా హనుమాన్‌కు మల్లెపూల మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి, శుభకార్యాలు వంటివి చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. 
 
అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేశారట. అందుకే హనుమంతునికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. 
 
ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు. అలాగే తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది కనకు హనుమంతునికి కూడా ఇష్టమైనది. కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పువ్వులు. 
 
కేరళలోని ఇరింజలకుడ అనే ప్రాంతంలో భరతునికి ఆ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కలువ పూల మాల వెయ్యడం సంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా తాగి పడిపోయిన బెంగళూరు యువతులు (video)

వందే భారత్ స్లీపర్ రైలు కోల్‌కతా - గౌహతిలో మార్గంలో...

న్యూ ఇయర్ పార్టీలో విషాదం.. బిర్యానీ ఆరగించి వ్యక్తి మృతి.. మరో 15 మంది...

పెన్నును మింగుతానంటూ ఫ్రెండ్స్‌తో పందెం, మింగేసాడు

యువతిని ప్రేమించి పెళ్లాడాడని స్తంభానికి కట్టేసి కొట్టారు

అన్నీ చూడండి

లేటెస్ట్

వైకుంఠ ఏకాదశి విశిష్ఠత: తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న ఆలయాలు (video)

30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

Show comments