మనసే మన గురువు... చెప్తే వింటామా...? మనసు ఏం చేస్తుంది...?

మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ'లోచనం' చేసేదే మనసు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన 'తొలిగురువు' అంటోంది వేదస

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (20:43 IST)
మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ'లోచనం' చేసేదే మనసు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన 'తొలిగురువు' అంటోంది వేదసారం. 'నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్నే చూడమంటోంది.
 
ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఎవరి సలహాను కూడా ఈ మనసు పరిగణనకు తీసుకోదు. కాని, ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యపై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గత కాలంలో మనం చేసిన కర్మ వలన ఏర్పడిన దుష్ఫలితాలపై ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో శరీర ఆరోగ్యాన్ని గురించి కూడా ఉండవచ్చు.
 
ఈ ఆలోచన అనే ప్రక్రియ సాధారణంగా బాహ్య వాతావరణానికి సంబంధించి ఉంటుంది. ఏ పరిస్థితులలోను ఈ మనసు తన గురించి తాను ఆలోచించదు. ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కాని, కొన్ని కోరికల గురించి కాని జరుగుతుంది. బాహ్యాన్ని గురించి జరిగే ఈ చింతన ప్రక్రియనే ఆలోచన అంటాం. కాని ఈ ఆలోచన ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకనపుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితుడైన వ్యక్తిని ఆ సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా లోకంలో జరిగేదే.
 
• మనసే ఒక లోచనం
 
ఆలోచన అనే పదంలోనే 'ఆ' అంటే ఎక్కడో దూరంగా మనకన్నా భిన్నంగా గాని మనకన్నా వేరుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆలోచనంలో ఉన్న 'లోచనం' అంటే కన్ను అని అర్థం. అంటే దీన్నిబట్టి చూస్తే మన మనసే ఒక కన్ను అనవచ్చు. ఈ మనసు అనే కన్ను ఎంత సేపటికి బయటకే పరుగెడుతుంది కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం.
 
ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని 'గురువు' అంటారు. కేవలం మనుషులే కాదే ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలించి చూస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా గురువే అవుతుంది. దత్తచరిత్ర కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటున్నాం. అందువల్ల మన మనసును కూడా 'గురువు'గానే పరిగణించాలి
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Avian Flu: కేరళలో ఏవియన్ ఫ్లూ.. రెండు జిల్లాల్లో నిర్ధారణ.. చికెన్‌పై ఆంక్షలు

భవిష్యత్తు ఫెయిల్ అయింది... నేను వెళ్లిపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు... సారీ మై బాయ్...

మొన్న తిరుమల లడ్డూ, నిన్న పరకామణి, నేడు తిరుపతి గోవిందరాజ స్వామి 50 కిలోల బంగారం మాయం?!!

యువకుడితో అక్రమ సంబంధం : భర్తను చంపి గుండెపోటుతో చనిపోయినట్టుగా భార్య కట్టుకథ

Logistics Manager: లాజిస్టిక్స్ మేనేజర్‌ను గొంతునులిమి చంపేసిన భార్య, ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలంతా చీరే కట్టుకోవాలా? పురుషులు కూడా మెట్టెలు, కడియాలు ధరించండి.. : చిన్మయి చిందులు

హీరోయిన్ల అందం ఎక్కడ ఉంటుందో తెలుసా? హీరో శివాజీ కామెంట్స్

Chiranjeevi: బిజినెస్ భారీగా జరిగేంతగా మన శంకర్ వర ప్రసాద్ చిత్ర నిడివి వుంది

Eesha Rebba: సూపర్ హిట్ వెబ్ సిరీస్ 4 మోర్ షాట్స్ ప్లీజ్ అంటున్న సీజన్ 2

మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన డార్క్ కామెడీ మూవీ గుర్రం పాపిరెడ్డి

Show comments