అతిఖర్చు వద్దు బాబోయ్!: ఇవిగోండి టిప్స్!

Webdunia
సోమవారం, 30 జూన్ 2014 (13:06 IST)
ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలే ప్రజల అతిఖర్చుకు ప్రధాన కారణమవుతున్నాయి. ఈ ప్రకటనలు అవసరాలను కూడా సృష్టించి వినియోగదారుడి బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. అతిఖర్చు వల్ల ఆర్థిక పతనానికి దారి తీస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
 
భారీ ధరలకు ఉత్పత్తులను, సేవలు అందించడం కోసం బ్రాండ్లు ఆవిర్భవించాయి. ఏ బ్రాండ్ ప్రత్యేకత ఆ బ్రాండ్‌కు ఉంటుంది. వీటిని ఎంతైనా వెచ్చించి కొనేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. హాలీవుడ్‌లో వచ్చిన కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎ షపోహాలిక్ సినిమా అతిఖర్చుకు, షాపింగ్‌కు బానిస అయిన ఓ మహిళ జీవితానికి చక్కని ఉదాహరణ. ఇందులో ప్రధాన పాత్రధారి ఒక్క రోజు కూడా షాపింగ్ చేయకుండా ఉండలేదు. అప్పు చేసైనా సరే ఖరీదైన బ్రాండ్లనే కొంటుంది. ఇలా ఈమెకు ఉద్యోగం ఊడిపోతుంది. తల్లిదండ్రులు, స్నేహితులు దూరమవుతారు. ఈ సినిమా కథ నిజ జీవితానికి దగ్గరగా వుందని, నిజ జీవితంతో ఖర్చులపై నియంత్రణ లేకపోతే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అందుచేత ఖర్చులను తప్పకుండా నియంత్రించుకోవాలి.
 
* ఖర్చులను నియంత్రించాలంటే బడ్జెట్ వేసుకోవాలి. 
* తప్పనిసరి ఖర్చులపైనే దృష్టి సారించాలి
* అవసరాలు పూర్తయ్యాక కోరికల గురించి ఆలోచించాలి
* డబ్బు మిగిలింది కదా.. అంటూ విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు
* విహారయాత్రలకు మీ బడ్జెట్‌లో కొంత మాత్రమే కేటాయించండి.. అందుకు తగ్గట్లు ప్రదేశాలను ఎంచుకోవాలి. 
* అప్పులతో ఆర్థిక పతనం ఖాయం.. వాటికి ఎంత వీలవుతుందో అంత దూరంగా ఉండాలి 
* గృహోపకరణాలపై ఖర్చులు అవసరం మేరకే ఉండాలి. 
* క్రెడిట్ కార్డులను అవసరానికి తగిన మేరకే ఉపయోగించాలి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ ఇంటిని చక్కదిద్దుకోవడమే గాకుండా.. ఆర్థిక పతనానికి కారణం కాకుండా ఉంటారని సైకాలజిస్టులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

AP Liquor Scam: రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆ ముగ్గురికి?

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపిన నలుగురు అరెస్ట్

మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు

ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్

Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?

Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్

Varalakshmi : సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

Keeravani: విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : ఎంఎం కీరవాణి

Show comments