Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-03-2019 నుంచి 09-03-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (19:59 IST)
సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, మేష, వృషభ, మిధున, కర్కాటకంలలో చంద్రుడు. 2న మతత్రయ ఏకాదశి, 3న మహాశివరాత్రి. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అనుకూల పరిస్థితులున్నాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. పనులు నిదానంగా పూర్తికాగలవు. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. దస్త్రం ముహుర్తాలు నిశ్చయించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, పనిభారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఓర్పుతో వ్యవహరించాలి. తప్పటగుడు వేసే ఆస్కారం ఉంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆహ్వానం, నోటీసులు అందుతాయి. గురు, శుక్ర వారాల్లో ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన అందక ఇబ్బందులెదుర్కుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. శనివారం నాడు ప్రముఖల సందర్శనం వీలుకాదు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తికాగలవు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. అతిగా ఆలోచించవద్దు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. దస్త్రం వేడుకలకు ముహూర్తం ఖాయమవుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, ఓర్పు ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక అయిన వారిని సంతోషపరుస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. మంగళ, బుధ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. పట్టుదలతో పోవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పనులు సకాలంలో పూర్తికాగలవు. లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. దైవకార్యం, ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. చీటికి మాటికి అసహానం చెందుతారు. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. ఆహ్వానం అందుకుంటారు. గురు, శుక్ర వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దస్త్రం వేడుకలకు ముహుర్తం నిశ్చయమవుతుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వైద్య, సాంకేతిక, అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకం.    
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబటిపై దృష్టి పెడతారు. చెల్లింపులు, అవసరాలు వాయిదా పడుతాయి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. శనివారం నాడు శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
ధనస్సు: మూల, పూర్వాషడ, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు మెరుగుపడుతాయి. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. ఆది, సోమ వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి కలుగుతుంది.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. మంగళ, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషాయాలు పట్టించుకోవద్దు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు బలపడుతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు ఫలిస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. బుధు, గురు వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆశావాహ దృక్పథందో యత్నాలు సాగించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం, నోటిసులు అందుకుంటారు. ఒక సందేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరువ్యాపారులు ఆదాయాభివృద్ధి. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, కేవతి
ఈ వారం అనుకూలతలున్నాయి. కష్టం ఫలిస్తుంది. వాగ్ధాటితో రాణిస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. శుభ, దైవ కార్యాలకు యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషాన్నిస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments