Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది నుంచి ఈ రాశుల వారికి పట్టిందంతా బంగారమే..!

2018 మార్చి 18వ తేదీన ఉగాది రానుంది. ఉగాది తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. తెలుగువారికి ఉగాదితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజు పండితులు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తారు. ఆరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, గుమ్మా

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (14:20 IST)
2018 మార్చి 18వ తేదీన ఉగాది రానుంది. ఉగాది తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. తెలుగువారికి ఉగాదితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజు పండితులు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తారు. ఆరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, గుమ్మానికి తోరణం కట్టి, వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసుకుని, చిన్నాపెద్దా కొత్త బట్టలు ధరిస్తారు. ఉగాది పచ్చడి చేస్తారు. భగవంతుని దగ్గర ఆ పచ్చడిని పెట్టి అందరికీ ఈ యేడాది ఈ పచ్చడి లాగానే అన్ని రుచులతో కమ్మగా ఉండేటట్లు చూడమని ఆ దేవుడిని వేడుకుంటారు.
 
ఉగాది రోజు అందరూ వారివారి పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి ఆ యేడాదంతా ఏ నెల ఎలా ఉంది వారి ఆదాయవ్యయాలు, రాజ పూజ్యం, అవమానాలు చూస్తుంటారు. అయితే ఉగాది నుంచి రెండు రాశుల వారికి మాత్రమే చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సింహరాశి, తులా రాశి వారికి ఉగాది తరువాత అద్భుత ఫలితాలు రాబోతున్నాయంటున్నారు. అయితే ఈ రెండు రాశుల వారికి నవగ్రహ శాంతి అవసరం. అందుకే నవగ్రహ శాంతి చదవాలి. వీరికి డబ్బులు బాగా వస్తాయట.
 
కానీ ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుందట. అందుకే డబ్బు ఖర్చు తగ్గించేందుకు నవగ్రహ శాంతి అవసరం. సోమవారం శివాలయానికి వెళ్ళాలి. వీరికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అనుకున్నది మాత్రం నెరవేరుతుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మాత్రమే వస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments