Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులారాశి జాతకులు.. మేకప్ అంటే పడి చస్తారట!

Webdunia
శనివారం, 21 జూన్ 2014 (16:52 IST)
తులారాశిలో పుట్టిన జాతకులు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నత స్థానాలను అధిరోహించే ఈ జాతకులు సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఇతరులను ఆకట్టుకునే అందచందాల్ని కలిగివుండే ఈ జాతకులు అలంకారప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
 
జీవితంలో తలెత్తిన విషాద సంఘటనలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్యాలను చేరుకునే దిశగా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఎత్తులకు పై ఎత్తులకు వేయడంలో వీరిది అందెవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందే ఈ జాతకులు.. అన్ని విషయాల్లో కూతురికి అధిక ప్రాధాన్యం, మినహాయింపు ఇస్తారు. 
 
ఇతరుల అభిరుచిని తేలిగ్గా తెలుసుకునే తులారాశి జాతకులు.. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలోను రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రజాకర్షణ ఎక్కువగా ఉండే వృత్తి ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. 
 
కానీ బంధువర్గంతో విభేధాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలోని వారి వల్ల కుటుంబానికి అపకారం జరుగుతుంది. అయితే ఈ జాతకులకు సన్నిహిత వర్గం అండదండలు వెన్నంటి ఉంటాయి. ఇంకా ఈ జాతకులు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే.. లక్ష్మీదేవి పూజ చేయడం శ్రేయస్కరం. అదేవిధంగా అమావాస్య రోజున హనుమాన్ ఆలయాల్లో నేతితో దీపమెలిగించడం ద్వారా వ్యాపారాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
ఇకపోతే... ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటంతో గురువారం అన్ని విధాలా కలిసివస్తుంది. గురువారం నాడు ఆరంభించే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే తులారాశి జాతకులకు నీలపు రంగు అనుకూలిస్తుంది. ఎప్పుడూ నీలం రంగు చేతిరుమాలును వాడటం మంచి ఫలితాలనిస్తుంది. 
 
ఇక అదృష్ట సంఖ్యల విషయానికొస్తే.. ఆరు అనే సంఖ్య శుభ ఫలితాలనిస్తుంది. ఇంకా 4, 5, 8 అనే సంఖ్యలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ 1, 2 అనే సంఖ్యలు వీరికి ఏ మాత్రం కలిసిరావని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments