Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం క్షేత్రాన్ని భాద్రపద మాసంలో దర్శించుకుంటే? (video)

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (23:09 IST)
భక్తులపాలిట కొంగు బంగారమై శ్రీశైలముపై భ్రమరాంబా సమేతుడై కొలువైవున్నాడు మల్లికార్జునస్వామి. ఎంతో పరమపవిత్రమైన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారి పీఠం ఒకటి. ఇక్కడ స్వామి వారు స్వయంభువుగా వెలిశారు.

ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీ అని పిలుస్తారు. ఈక్షేత్రాన్ని ఒకసారి దర్శించిన ఎంతో ముక్తికలుగుతుందని, పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. అలాంటి ఈక్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఎలాంటి ఫలం వస్తుందో శ్రీ పర్వత పురాణం ప్రకారం ఒకసారి తెలుసుకుందాం. 
 
చైత్ర మాసం : చైత్రమాసంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే భక్తులకు సకల సుఖాలు,
వైశాఖ మాసం : కష్టనాశనం, లక్ష గోవుల ధానఫలం కలుగుతుంది.
జేష్ట మాసం : కోరిన కోర్కెలు ఫలిస్తాయి. సువర్ణదాన ఫలం లభిస్తుంది.
 
ఆషాఢమాసం : కోటి గోవులను శివునికి దానం ఇచ్చిన ఫలం
శ్రావణ మాసం : యోజనమంత పొలమును పండితునికి దానం ఇచ్చిన ఫలం
భాద్రపద మాసం : పండితులకు పాడి ఆవులను ఇచ్చి సేవించిన ఫలం
 
ఆశ్వీయుజ మాసం : సకల పాపములు నశించి, అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి.
కార్తీక మాసం : యజ్ఞములలో అతి గొప్పదైన వాజపేయ యాగం చేసిన ఫలం
మార్గశిర మాసం : చేసిన పాపములు తొలగి, వెయ్యి యాగాలు చేసిన ఫలం
 
పుష్య మాసం : పాతకముల నుండి ముక్తి కలిగి, అతిరాత్రి యజ్ఞం చేసిన ఫలం
మాఘ మాసం : ఆయుస్సు కలిగి, రాజసూయ యాగం చేసిన ఫలం
పాల్గుణ మాసం : జన్మ జన్మలకు తరగని సంపద, పుణ్యము కలుగును అని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments